desk journalits : పరుగెత్తే చీకటి సూర్యులు..
desk journalits : కాలంతో కలిసి నడవడం అందరికీ తెలుసు.. కానీ అదే కాలంతో పోటీగా పరుగెత్తడం మాత్రం చీకటి సూర్యుల కలాలకే తెలుసు.. రేపటి కోసం అక్షర సేద్యం చేస్తూ.. సూర్యోదయం.. సూర్యాస్తమయం చూడని ఈ నిశాచర జీవుల డ్యూటీ నిత్యపోరటమే. తొలికాపీ నుంచి మొదలు చివరి కాపీ దిద్దేవరకూ అదే ఉత్సాహం, అదే కమిట్‌మెంట్, అదే కసి ఉండాలి. నాలుగు స్టోరీలు ఎడిట్‌చేశాం.. పదో ఇరవై స్పాట్స్ బ్రీఫ్ చేశామంటూ రిలాక్స్‌అయ్యే పరిస్థితి ఉండదు. ఐటమ్‌అసైన్‌అయిన ప్రతిసారీ మెదడు యాక్టివ్‌కావాలి. ఊపు.. ఉత్సాహం ఏమీ తగ్గకూడదు. అక్షర దోషాలు.. వాక్య నిర్మాణ దోషాలు.. అన్వయ దోషాలు.. గణాంకాల గందరగోళం.. వివరణలు లేని వివాదాస్పద వార్తలు.. అప్‌డేట్‌అంటూ అడ్డగోలుగా ఫోన్లు ఇలా ఎన్నెన్నో ఎదురవుతున్నా ఏకాగ్రత కోల్పోకూడదు. దృష్టంతా పనిమీదనే ఉండాలి. అన్నీతానై కీలకంగా వ్యవహరించేది డెస్క్ జర్నలిస్టులే.. ఈ విషయం చాలా కొద్ది మందికే తెలుసు. కొవ్వొత్తి తానూ కరుగుతూ వెలుగును పంచుతున్నట్టే.. శిల.. అందమైన శిల్పంగా మారడానికి శిల్పి శ్రమ పడినట్డుగానే.. పొద్దుపొద్దునే అందరూ చదివే పత్రిక బయటకు రావడంలోనూ డెస్క్ జర్నలిస్ట్ ది అంత కీలక పాత్ర ఉంది. మీడియా రంగంలో డెస్క్ జర్నలిస్డులకు సముచిత ప్రాధాన్యం దక్కాల్సిన అవసరముంది.
అక్రిడేషన్‌కమిటీలో..
అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు అందజేసేందుకు రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయిలోనూ ప్రతి ఏటా కమిటీలు ఏర్పాటు చేస్తారు. రాష్ట్రస్థాయిలో అయితే సమాచార కమిషనర్, జిల్లా స్థాయిలో అయితే కలెక్టర్‌అధ్యక్షతన పెద్ద పత్రికలు, చిన్నపత్రికలు, యూనియన్లు, ఫొటో, వీడియో జర్నలిస్టులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీల్లో డెస్క్‌జర్నలిస్టులకు (desk journalits ) ప్రాతినిధ్యం తప్పనిసరిగా ఉండాలి.
అవార్డుల్లోనూ అంతే…
జర్నలిజంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన రిపోర్టర్లు, ఫొటో జర్నలిస్టుల జాబితా ప్రకటిస్తూ వారికి పురస్కారాలు అందజేస్తారు. డెవలప్‌మెంట్‌న్యూస్, ఇన్వెస్టిగేషన్‌స్టోరీస్, హ్యుమన్‌స్టోరీస్, సెన్సేషనల్‌ఫొటోస్‌అంటూ పలు విభాగాల్లో అవార్డులూ రివార్డులూ ఇస్తారు. కానీ ఇందులో కీలకంగా పాలుపంచుకునే డెస్క్‌జర్నలిస్టులను విస్మరిస్తున్నారు. ఉత్తమ డెస్క్‌జర్నలిస్టు అనో, ఉత్తమ హెడ్డింగ్, బెస్ట్‌ఎడిటింగ్, బెస్ట్‌ప్రజంటేషన్‌అంటూ ఎన్నో విధాలుగా డెస్క్‌జర్నలిస్టుల (desk journalits) ప్రతిభను పరిగణనలోకి తీసుకోవచ్చు.
యూనియన్లు, ప్రెస్‌క్లబ్‌పాలకవర్గాల్లోనూ..
జర్నలిస్టుల సంఘాలు, ప్రెస్‌క్లబ్‌పాలకవర్గాల్లోనూ డెస్క్‌జర్నలిస్టులకు సముచిత ప్రాధాన్యం దక్కాల్సిన అవసరముంది. వీడియో, ఫొటో జర్నలిస్టులు, మహిళా జర్నలిస్టులకు పలు ప్రాంతాల్లోని ప్రెస్‌క్లబ్‌లు కమిటీల్లోని కొన్ని స్థానాలకు వారికి రిజర్వు చేస్తున్నాయి. అంటే ఆ స్థానాలకు వారు తప్ప మరొకరు పోటీ పడకూడదు. ఇంకొన్ని చోట్ల అధ్యక్ష పదవి ప్రింట్‌మీడియాకు కేటాయిస్తే.. ప్రధాన కార్యదర్శి పదవి ఎలక్ట్రానిక్‌కు మార్చి మార్చి పదవీకాలలు మారినప్పుడల్లా పదవులు రొటేషన్లు చేస్తున్న పరిస్థితులు చూశాం. ఇప్పటి వరకు డెస్క్‌జర్నలిస్టులకు ప్రధాన పదవులు దక్కిన సందర్భాలూ బహు అరుదు. మొట్టమొదటిసారిగా వరంగల్‌ప్రెస్‌క్లబ్‌ప్రధాన కార్యదర్శి పదవికి పెరుమాండ్ల వెంకట్‌పోటీ చేశాడు. ఆ ఎన్నికల క్షేత్రంలో డెస్క్‌జర్నలిస్టులంతా ఏకతాటిపైకి వచ్చి వెంకట్‌కు మద్దతు ఇచ్చారు. గట్టిపోటీ ఇవ్వడం, ఓట్లు సమంగా రావడంతో టాస్‌వేశారు. టాస్‌లో ఓటమి కారణంగా ప్రధాన కార్యదర్శి పదవి తృటిలో తప్పిపోయింది. మలిదఫా ఎన్నికల్లో అదే వరంగల్‌ప్రెస్‌క్లబ్‌కు పెరుమాండ్ల వెంకట్‌ప్రధాన కార్యదర్శి అయ్యాడు. డెస్క్‌జర్నలిస్టులు గర్వంగా చెప్పుకోవడానికి ఇదొకటే ఉదాహరణగా కనిపిస్తోంది.
ఓరుగల్లు, పాలమూరు డెస్క్‌జర్నలిస్టుల సమష్టి కృషితో…
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందునుంచీ ఓరుగల్లు, పాలమూరు డెస్క్‌జర్నలిస్టులు కోసం అక్రిడేషన్లు కావాలంటూ నినదించారు. క్రమక్రమంగా ఆ నినాదం అన్ని జిల్లాలను తాకింది. ఈ రోజు డెస్క్‌జర్నలిస్టుల్లో మెజారిటీగా అక్రిడేషన్లు అందుతున్నాయంటే.. ఈ రెండు జిల్లాలు చూపిన తొవ్వే కారణం. వరంగల్‌నుంచి సీనియర్‌జర్నలిస్టు శంకేసి శంకర్‌రావుగారు నేను మరికొందరం డెస్క్‌జర్నలిస్టులకు అక్రిడేషన్ల కోసం అందరినీ మమేకం చేశాం. అక్రిడేషన్ల జారీకి నంబరింగ్‌నిబంధన ఉన్న తరుణంలో డెస్క్‌జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు అందలేదు. దీని కోసం కూడా ఒత్తిడి తేవాల్సి అవసరం ఉంది.
హెల్త్‌కార్డుకు అక్రిడేషన్ లింకొద్దు…
అక్రిడేషన్‌కార్డులు ఉన్న వారికి ప్రభుత్వం జారీ చేసే హెల్త్ కార్డులు అందుతున్నాయి. నంబరిగ్‌నిబంధన కారణంగా డెస్క్‌జర్నలిస్టులతో పాటు రిపోర్టర్లు, ఫొటోగ్రాఫర్లలో అక్రిడేషన్ కార్డులు రాని వారు ఉన్నారు. వీరంతా హెల్త్ కార్డుకు దూరమయ్యారు. అర్హులైన వారందరికీ అక్రిడేషన్‌తో సంబంధం లేకుండా హెల్త్‌కార్డులు జారీ చేయాలి.
ఇంటికి చేరే వరకూ…
డెస్క్‌జర్నలిస్టు ఇంటికి చేరే వరకూ కుటుంబ సభ్యుల ఆందోళన ఎంతో. ఫలానా టైమ్‌కు ఇంటికి వస్తా అని చెప్పినా, సరైన సమయానికి ఇంటికి చేరని సందర్భాలే అధికం. పని భారమో.. అర్ధరాత్రి జరిగే ఇన్సిడెంట్స్, పొలిటికల్‌డెవలప్‌మెంట్ ఎలా నిత్యం ఏదో ఒక పనిలో డెస్క్‌జర్నలిస్టు నిమగ్నం కావాల్సి ఉంటుంది. పత్రిక బయటకు వచ్చే ప్రక్రియలో అంత కీలకం కాబట్టి ఆలస్యం అనేది కామన్‌అయ్యింది. అర్ధరాత్రి వేళ ఇంటికి చేరే సమయంలో ప్రమాదాల బారిన పడి గాయపడినవారు, ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు.
ఆరోగ్య శిబిరాలూ అవసరమే..
అక్షర కార్యక్షేత్రంలో అన్ని మరిచి డెస్క్‌జర్నలిస్టులు పనిలో నిమగ్నమతారు. అన్నపానీయాలూ గుర్తుకురావు. ఏదైనా పని అయిపోయాకే అంటూ.. పొద్దువాలిపోతున్నా పట్టించుకోకుండా పనిచేసుకుంటూ పోతారు. పనిలో చేరింది మొదలు బీపీ, షుగర్, సైట్, హార్ట్ స్ట్రోక్స్‌తదితరాలు డెస్క్‌జర్నలిస్టుల్లో అంతర్భాగం అవుతున్నాయి. ఎక్కడో ఒక చోట డెస్క్‌జర్నలిస్టులు ఈ తరహా జబ్బులతో రాలిపోతూనే ఉన్నారు. కరోనా వైరస్‌విశ్వవ్యాప్తి అవుతున్న తరుణంలోనూ అందరు డెస్క్‌జర్నలిస్టులకు హోం టు డెస్క్‌సాధ్యం కాదని తెలుసు.. కరోనా రక్కసి బలి తీసుకుంటుందని తెలిసినా, కుటుంబసభ్యులు వద్దని వారించినా, పనిపని అంటూ డ్యూ టీకి రెడీ అవుతూనే ఉంటారు. మరి ఇంత కీలకంగా ఉండే డెస్క్‌జర్నలిస్టుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య శిబిరాలు తప్పనిసరి.
(మరిన్ని కథనాల కోసం క్లిక్ చేయండి)
– టి.జాన్ రెడ్డి, సీనియర్ డెస్క్‌జర్నలిస్ట్