minister Rasaleelalu : పొమ్మనలేకే పొగ..?

minister Rasaleelalu : పొమ్మనలేకే పొగ..?

minister Rasaleelalu : పొమ్మనలేకే పొగ..?

minister Rasaleelalu : పొమ్మనలేకే పొగ..?
పొమ్మనలేక పొగ పెట్టుడంటే మనందరికీ తెలుసు. ఎవరి మీదనైనా ఇష్టం లేకపోతే వారిని ఎప్పుడు దూరం పెడదామా.. బయటకు పంపిద్దామా..! అని ప్లాన్‌ వేస్తాం. అది ఇళ్లయినా.. ఆఫీసైనా.. మరే సంస్థ అయినా.. పార్టీ అయినా.. ఎక్కడైనా సరే.. అదే తంతు.. ఇంతకీ ఈ పొగ పెట్టుడు టాపిక్ ఇప్పుడెందుకు కొచ్చింది అంటారా.. అసలు విషయానికి వెళ్దాం పదండి..

అధికార పార్టీకి చెందిన ఓ మంత్రి వ్యవహారం ప్రస్తుతం ఇదే పరిస్థితిలో ఉందనిస్తోంది. ఆ జిల్లా ఉత్తర తెలంగాణకు పెద్దదిక్కు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రాతం.. సీఎం ఏ పనినైనా అక్కడి నుంచే మొదలు పెడతారు. ఆ జిల్లా అంటే అంత సెంటిమెంట్ ఆయనకు.. అలాంటి సెంటిమెంట్ ఉన్న జిల్లాకు ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రిపై పెద్దాయన కన్ను పడిందా.. పార్టీయే టార్గెట్ చేసిందా.. లేక అతడే ఉచ్చులో ఇరుక్కున్నాడా అనే సందేహాలు పక్కన పెడితే.. ఆ లీడర్‌‌పై వస్తున్న ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి.. అసలు విషయం మీకు అర్థమైందనుకుంటా.. ఆ.. ఆ.. మీరనుకుంటున్న ఆయనే..

కార్పొరేటర్ స్థాయి నుంచి నాయకుడిగా ఎదిగాడు. నాలుగైదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. మంత్రి కావానలేది ఆయన చిరకాల కోరిక.. రాష్ట్రంలో టీఆర్ఎస్ రెండో సారి అధికారంలోకి వచ్చాక తమ రాజకీయ జీవితంలో ఏనాడు మంత్రి కాలేమనుకున్న వారు సైతం.. తంతే పరుపుల పడ్డట్లుగా పదవులు దక్కించుకున్నారు. పెద్దాయన చలవో, ఇంకేదో కోటానో ఏమోగాని ఆ లీడర్‌కి కూడా మంత్రి హోదా దక్కింది. అయితే సదరు నాయకుడు పదవి వచ్చిన తర్వాత చేస్తున్న పనులు.. గతంలో చేసిన పనుల మీద మాత్రం అధిష్ఠానం నిఘా గట్టిగానే పెట్టినట్లుంది. కానీ, సారుకు సహజ సిద్ధంగా ఉన్న అలవాట్లు ఎటు పోతాయ్.. ఎదో సామెత చెప్పినట్లు.. ‘ దేన్నో తీసుకొచ్చి కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టినా..’ దాని బుద్ధి మారదు కదా..! అలాగే ఆ ప్రబుద్ధుడి బుద్ధులే అతడి కొంపముంచేలా చేశాయ్. సుఖ పురుషుడిగా పేరున్న ఆయనకు ఇవన్నీ కామనే.. కానీ నగరంలో ఇటీవల జరిగిన ఓ షో ఆయనగారిని నడిరోడ్డున పడేసింది.

ఆ లొల్లిలోకి కారణం ఓ సినిమా హీరోయిన్.. హీరోయిన్ అనే కంటే పార్టీకే అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి అంటే బెటర్.. ఆమె మీద కన్ను పడడం.. ఆయన గారి పరువు కాస్తా సోషల్‌ మీడియాలో పడింది. అసలు ఆ షో వీరి బాగోతం బయటపెట్టడానికే పెట్టినట్లు ఉంది. అక్కడ జరిగిన గలాటలో ఆయనగారి అసలు విషయం బయటపడింది. ఇంకేముంది ఈ విషయం కాస్త పార్టీ పెద్దల చెవుల్లో పడింది. రచ్చరచ్చ అయ్యింది. పార్టీకి సంజాయిషి చెప్పుకునే పరిస్థితి తెచ్చింది.
వాళ్లే ఎందుకు మోగిస్తున్నారు.. ?

మంత్రి చేసిన వ్యవహారమంతా (minister Rasaleelalu) ఎన్నో టీవీ ఛానల్లు ఉండగా.. ఆ టీవీలో మాత్రమే ఎందుకు ప్రసారం చేస్తున్నారనే అనుమానాలు వస్తున్నాయి. అందులోనూ సదరు చానెల్‌ పార్టీకి సంబంధం ఉన్న వ్యక్తులదే కావడం ఆ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. టైమ్‌ చిక్కినప్పుడే చేతిలోకి తీసుకోవాలన్న ప్లాన్‌ను పార్టీ పెద్దలు వర్క్ అవుట్‌ చేస్తున్నారా.. అనేది తెలియని పరిస్థితి. కేవలం వాట్సప్ చాటింగ్‌లు.. ఫేస్ బుక్ మెసేజ్‌లతో ఆ వ్యవహారాలను ఎలా ధ్రువీకరిస్తారు..? వారి వద్ద మరేమైనా ఆధారాలు ఉన్నాయా..? అనేది అంతుచిక్కని ప్రశ్నే.. మొన్న అక్క ప్రమాణ స్వీకారం చేయడం.. మరునాడే మంత్రి బాగోతం బయటకు తీసుకురావడం వెనక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి..? అక్క కోసం మరోకరిని బలి చేస్తున్నారా..? నేరుగా బయటికి పొమ్మనలేకనే ఈ పొగపెడుతున్నారా..? అనే విషయాలు అక్కడి‌ ప్రజల మదిని తొలుస్తోంది.
వారికిది కొత్తేమీ కాదు..

రాజకీయల్లో ఎదిగే వారిని పాతాళానికి తొక్కడం కొత్తేమి కాదు. అందులో అధికార పార్టీలో ఇది మరీ ఎక్కువగా ఉంటుంది.. గతంలో సీఎం తర్వాతి హోదాలో ఉన్న ఓ వ్యక్తిని ఇలాంటి ఆరోపణతోనే బర్త రఫ్ చేసి తక్కి పడేశారు. ఆ తర్వాత ఆయనకు తగ్గట్లుగా మరో నేతను తెరపైకి తెచ్చినట్లే తెచ్చి కారు స్టేరింగ్‌ అప్పగించినా చివరకు టైరు గాలి తీశారు. ఆయనకీ ఉనికి కూడా లేకుండా చేశారు. ఇప్పుడు ఈయనగారి వంతు వచ్చినట్లు ఉంది. (minister Rasaleelalu)

(జీతం సరిపోక ఆటో నడిపిన డెస్క్‌ జర్నలిస్టు)

(నక్సలిజం నుంచి జర్నలిజంకు వచ్చిన బాలన్న)

(జీతం కోసం చేరితే జీవితమైంది.. నమస్తే నయా దునియా)

You may also like...

1 Response

  1. 01/11/2020

    […] (పొమ్మనలేకే పొగ..?) […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *