graduate vote : గ్రాడ్యుయేట్ ఓటు నమోదుపై అవగాహన కల్పించాలి

graduate vote : గ్రాడ్యుయేట్ ఓటు నమోదుపై అవగాహన కల్పించాలి
  •  తెలంగాణ నిరుద్యోగ జేఏసీ నేత డాక్టర్ సుధాకర్

పాలకుర్తి టౌన్, (చౌరాస్తా న్యూస్) : గ్రాడ్యుయేట్‌ ఓటరు నమోదుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలంగాణ రక్షణ వేదిక, తెలంగాణ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మేడారపు సుధాకర్, గిలకత్తుల సోమశేఖర్ గౌడ్ కోరారు. ఈ మేరకు పాలకుర్తి తహసీల్దార్ తీరందాసు వెంకటేశ్వర్లుకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్నందున ఓటరు నమోదు స్పీడప్‌ చేయాలన్నారు. మండలంలోని ఊరూరా సర్పంచ్లు, అధికారుల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, పట్టభద్రుడికి ఫారం 18 ఇవ్వాలని కోరారు. గ్రాడ్యుయేట్లు ఆన్‌లైన్‌లో అప్లై చేసిన అనంతరం వారిని తహసీల్దార్ కార్యాలయానికి డిగ్రీ వర్జినల్ సర్టిఫికెట్ తీసుకొని రమ్మంటున్నారని, పైచదువులు అవసరాల నిమిత్తం పట్టభద్రుల దగ్గర ఉండకపోవచ్చని, దానికి బదులు వేరే ఏదైనా గుర్తింపు కార్డను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఓటు నమోదు అవగాహన కోసం ముఖ్య కూడళ్లలో ప్లెక్సీలు, స్టాల్స్ ఏర్పాటు చేయాలని కోరారు. బూత్ లెవెల్ ఆఫీసర్లను గుర్తింపు కార్డులను వేరిఫై చేయడానికి గ్రామాల్లోకి పంపాలని అన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన తహసీల్దార్ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు గిలకత్తుల సోమశేఖర్ గౌడ్, జలగం అశోక్, కమ్మగాని వెంకటేశ్వర్లు, కోడెం సాయిరాం, అరుణ్ సాయి తదితరులు పాల్గొన్నారు.

 

మరిన్ని కథనాల కోసం..

వ్యవసాయమే నా లక్ష్యం..

అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్‌ జర్నలిస్ట్)

పొమ్మనలేక పొగ పెడుతున్నరు..

ఆటోనడిపిన పాలమూరు డెస్క్ జర్నలిస్ట్‌

ఉద్యోగం మానేకే అప్పు ముట్ట జెప్పిన

You may also like...