jangaon mla muttireddy : శాస్త్రాలను తిరగ రాయాలే..!

jangaon mla muttireddy : శాస్త్రాలను తిరిగ రాయాలే..!
  • రాముడు 14 ఏళ్లు ప్రజలను బాధపెట్టిండు
  • భారతంలో ధ్రౌపతి వస్త్రాభరణం ఘట్టాన్ని తీసేయాలి
  • జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి టికెట్‌ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది.. నిన్న మొన్నటి వరకు సొంత పార్టీ లీడర్లపై ప్రత్యేక్ష విమర్శలకు దిగిన ముత్తిరెడ్డికి.. పార్టీ హైకమాండ్‌ కళ్లేం వేయడంతో ఎవరిని ఎలా విమర్శించాలో తెలియక ఆయోమయానికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే ‘శాస్త్రాలను తిరిగి రాస్తే రాయనివ్వు..’ అంటూ రామాయణం, మహాభారతంపై నోటికి వచ్చిన విధంగా మాట్లాడారు. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తమ పార్టీలో జరుగుతున్న తీరును వివరించారు. కేసీఆర్‌‌ ప్రకటించిన తొలి జాబితాలో తనకు టికెట్‌ రాకుండా చేశారనే చెప్పుకొచ్చారు.

అయితే ఈ ప్రయత్నంలో ‘అలనాడు రామాయణంలో దశరథ మహారాజు రాముడికి పట్టాభిషేకం చేస్తానని చెప్పిండు.. రాత్రికి రాత్రే కైకేయి రాముడిని అడవులకు పంపాలని కుట్ర పన్నింది.. రాముడు ఆనాడు ఒప్పుకొని అడవులకు పోవడం అధర్మం.. రాముడు అడవులకు పోకూడదు.. శాస్త్రాలను తిరిగి రాస్తే రాయానియ్యి..’ ‘ప్రజా పాలన కోసం రాముడు కైకేయిని ఎదిరించాల్సి ఉండే.. 14 ఏండ్లు ప్రజలను అనవసరంగా బాధ పెట్టిండు..’ అంటూ వ్యాఖ్యానించారు. ఇక ‘మహా భారతంలో నుంచి ధ్రౌపది వస్త్రాభరణం ఘట్టాన్ని తీసేయాల్సిందే.. భీష్ముడు కూర్చుని చూడడం ముమ్మాటికీ తప్పే.. పాండవులు నిచ్చేస్తులై ఉండడం తప్పే..’ అంటూ శాస్త్రాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యాఖ్యలను హిందూ వాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మొత్తానికి సారు.. చెప్పినట్టు రాముడు అడవులకు పోకుంటే రామయణం కథ ఎట్టా ఉంటది.. భారతంలో ధ్రౌపతి ఘట్టాన్నీ తీస్తే.. మహాభారతం ముందుకు సాగేదా..! ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా చర్చించుకుంటున్నారు. ఏదీ ఏమైనా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తన బాధను వెళ్లగక్కే ప్రయత్నంలో ఇలాంటి కామెంట్లు చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది.

మరిన్ని కథనాల కోసం..

వ్యవసాయమే నా లక్ష్యం..

అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్‌ జర్నలిస్ట్)

పొమ్మనలేక పొగ పెడుతున్నరు..

ఆటోనడిపిన పాలమూరు డెస్క్ జర్నలిస్ట్‌

ఉద్యోగం మానేకే అప్పు ముట్ట జెప్పిన



You may also like...