Pay taxes responsibly : బాధ్యతగా పన్నులు చెల్లించండి
- అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్
జనగామ, (చౌరాస్తా ప్రతినిధి) : జనగామ పట్టణంలో ప్రజలు, వ్యాపారులు బాధ్యతగా మున్సిపల్ పన్నులు చెల్లించాలని అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ అన్నారు. పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయ సమావేశ మందిరంలో ఇంటి, నల్లా, ఇతర పన్నులపై వ్యాపారులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పింకేశ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పట్టణంలో ఇప్పటి వరకు కేవలం 32 శాతం పన్నులు మాత్రమే వసూలు అయినట్టు వివరించారు. అసలు పన్నుల చెల్లింపు కోసం ప్రతి ఒక్కరూ మార్చి 31వ తేదీనే ఎందుకు చూస్తారని, పన్నులు ఎప్పుడైనా చెల్లించవచ్చు అన్నారు. జనగామ పట్టణం కేవలం 1300 వ్యాపారులు మాత్రమే ట్రేడ్ లైసెన్స్ ఉన్నట్టు మున్సిపాలిటీ వారు గుర్తించడం సరికాదని, పట్టణంలో అంతకు రెండింతలు దుకాణాలు ఉన్నట్టు తెలుస్తోందని అడిషనల్ కలెక్టర్పేర్కొన్నారు. కొత్త వారిని లైసెన్స్‌లు తీసుకునేలా కృషి చేయాలన్నారు. ట్రేడ్ లైసెన్స్‌పై కూడా వ్యాపారులకు అవగాహన కల్పించి, ప్రతి ఒక్కరూ సకాలంలో పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధిలో తోడ్పాటునందించాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున, మున్సిపల్ కమిషనర్ చంద్రమౌళి, కౌన్సలర్లు బొట్ల శ్రీనివాస్, వాంకుడోతు అనిత, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పోకల లింగయ్య, మాజీ అధ్యక్షుడు పజ్జూరి గోపయ్య తదితరులు పాల్గొన్నారు.
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)