Work for the people : ప్రజల కోసం పనిచేయండి
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
- జనగామలో మంత్రుల టీ, టిఫిన్
జనగామ, (చౌరాస్తా ప్రతినిధి) : అధికారులు గత ప్రభుత్వంలో ఎలా పనిచేసినా ఇప్పుడు ప్రజల కోసం పనిచేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆఫీసర్లకు సూచించారు. శనివారం వరంగల్ పర్యటనకు వెళ్తున్న ఆయన, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో జనగామలో ఆగారు. పట్టణంలోని డీసీసీ కార్యాలయానికి ఉదయం 9 గంటల వచ్చిన వారికి జిల్లా కలెక్టర్ సి.హెచ్ శివలింగయ్య, అడిషనల్ కలెక్టర్ పింకేశ్ కుమార్, డీసీపీ సీతారాం, డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, జనగామ నాయకులు ఘన స్వాగతం పలికారు. మంత్రులతో పాటు పాలకుర్తి, మహబూబాబాద్ ఎమ్మెల్యేలు హనుమాండ్ల యశస్విని రెడ్డి, రామచంద్రు నాయక్, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి ఝాన్సీరెడ్డి, సింగారపు ఇందిరా ఉన్నారు. వీరంతా డీసీసీ ఆఫీస్‌లో అల్పాహారం చేసి వరంగల్‌కు బయలు దేరారు.
అయితే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా జనగామకు వచ్చారు. వారిని కలిసేందుకు స్థానిక లీడర్లు, అన్ని విభాగాల జిల్లా స్థాయి అధికారులు, మీడియా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కానీ, వరంగల్‌లో రివ్యూ మీటింగ్ ఉన్న నేపథ్యం మంత్రి పొంగులేటి కనీసం కుర్చిలో కూర్చో కుండానే ‘ఇది ప్రజా ప్రభుత్వం.. మీరంతా ప్రజల కోసం పనిచేయాలి’ అని ఆఫీసర్లకు సూచించి వెళ్లిపోయారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పీసీసీ మెంబర్ చెంచారపు శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ వేమళ్ల సత్యనారాయణ, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కోర్డినేటర్ నీలం పద్మా వెంకటస్వామి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శివరాజ్ యాదవ్, సీనియర్ నాయకులు మేడ శ్రీనివాస్, జక్కుల వేణుమాధవ్, ఆలేటి సిద్ధిరాములు, వివిధ మండలాలకు చెందిన సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)