Vaccine : అక్కడ పిల్లలకూ బూస్టర్ డోస్‌లు..
Vaccine : అక్కడ పిల్లలకూ బూస్టర్ డోస్‌లు..
ప్రపంచ వ్యాప్తంగా వేధిస్తున్న సమస్య వ్యాక్సిన్. ఆఫ్రికా ఖండంలోని చాలా దేశాల్లో ఇంకా 15 శాతం మందికి కూడా వ్యాక్సిన్ ఇవ్వలేక పోతున్నా. మొరాకో, లెబనాన్, లాంటి దేశాలు ఆపన్న హస్తం కోసం చూస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కలుగజేసుకుని చాలా పేద దేశాలకు వ్యాక్సిన్ అందించేందుకు కృషి చేస్తోంది. ఇదంతా ఎందుకు చెబుతున్నా అనుకుంటున్నారా?
అదేం లేదండి బండికి రెండు చక్రాలు ఉన్నట్టే ప్రపంచం కూడా రెండు విధాలుగా ఉంది అని చెప్పడానికే.. ఇలా ఒక వైపు వ్యాక్సిన్ కొరత ఉంటే మరో వైపు ఇజ్రాయిల్, చైనాలు తమ ప్రజలకు వ్యాకిన్ (Vaccine ) అందించేందుకు దూసుకుపోతున్నాయి.
చైనా అయితే ఏకంగా వంద కోట్ల మందికి వ్యాక్సిన్ అందించి రికార్డ్ సృష్టించింది. దాదాపు చైనా జనాభాలో సుమారు 80 శాతం మందికి వ్యాక్సిన్ అందించింది. ఇప్పుడు కరోనా వైరస్ నియంత్రణకు చైనా ముమ్మరంగా పోరాడుతోంది. సెప్టెంబర్ 15వ తేదీ నాటికి.. 2.16 బిలియన్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు జాతీయ హెల్త్ కమిషన్ ప్రతినిధి మీ ఫెంగ్ తెలిపారు. 89 కోట్ల మందికి పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ జరిగినట్లు గత నెలలో చైనా ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది చివరిలోగా దేశ జనాభాలో 80 శాతం మందికి వ్యాక్సిన్ ఇస్తామని ఇటీవల ప్రముఖ వైరాలజిస్ట్ జాంగ్ షాన్షాన్ తెలిపారు. దాంతో హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుందని ఆయన అభిప్రాయ పడుతున్నారు.
చైనా తయారు చేసిన వ్యాక్సిన్ (Vaccine ) కేవలం 60 శాతం మాత్రమే ప్రభావం చుపుతుండడంతో డ్రాగన్ కంట్రీ తెగ వర్రీ అవుతోంది. ప్రజల్లో సామర్థ్యాన్ని పెంచేందుకు బూస్టర్ డోస్‌ను అందిస్తోంది. ఇది కొద్దీ మేర ప్రభావం చూపడంతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేసింది. థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపుతోందని నిపుణులు హెచ్చరిస్తన్నారు. అయితే ఇప్పుడు అదే నిజం కానుంది. చైనాలో పెరుగుతున్న కేసుల్లో పిల్లల కేసులు పెరుగుతున్నాయి. అందుకోసమే పిల్లలకు కూడా బూస్టర్ డోస్‌లు ఇవ్వాలని ప్రయత్నిస్తోంది.