coronavirus : కరోనా.. నీకు దయ లేదా..!
coronavirus : కరోనా.. నీకు దయ లేదా..!
‘ఓ కరోనా.. నీకు దయ లేదా..! ఇంకా ఎన్ని ఘోరాలు చూపిస్తావు.. ఎందరి ఉసురుపోసుకుంటావ్.. ఎంత మందికి శోకం మిగులుస్తవ్.. దేవుడా పగోడికి కూడా ఈ బాధ రావొద్దు..’ అంటూ కరోనా బాధిత కుటుంబాలు రోదిస్తున్నాయి..
దేశంలో కరోనా (coronavirus) విలయతాండవం చేస్తోంది. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఈ వైరస్ బారిన పడి విలవిల్లాడుతున్నారు. కరోనా వల్ల కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి.. ఎందరో జీవితాలు దుర్భరంగా మారాయి.. ఆ కథలు వింటేనే మనసు చలించిపోతుంది..
భయంతోనే గుండె ఆగింది..
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం బోర్గం గ్రామానికి చెందిన అశోక్ కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ప్రస్తుత పరిస్థితిలో మనిషి దగ్గినా.. తుమ్మినా.. కరోనానే అనే అనుమానం కలుగుతోంది. అశోక్ కూడా రెండు రోజులుగా జర్వం వస్తుండడంతో కరోనా అనుకున్నాడు. ముందు జాగ్రత్తగా ఇంట్లో వారికి దూరంగా ఉంటూనే టెస్టు కోసం దగ్గరలోని పీహెచ్సీ వెళ్లాడు.. అక్కడ ఉన్న క్యూను చూసి ఒకింత భయపడ్డాడు. అయినా సరే మనులో దైర్యం చేసుకుని నిల్చున్నాడు. ఇంతలో తన నెంబర్ వచ్చింది. టెస్ట్ శాంపిల్ ఇచ్చిన వెంటనే అశోక్ వెన్నులో వణుకు మొదలైంది.. ఫలితం కోసం వేచి ఉండాలని పీహెచ్సీ సిబ్బంది చెప్పడంతో పక్కను ఉన్న ఓ చెట్టు కిందకు వెళ్లాడు.. అప్పటికే టెన్షన్ ఎక్కువై అక్కడే కుప్పకూలి పోయాడు.. తోడుగా వచ్చిన భార్య ‘ఇంటికి పోదాం.. లేవయ్యా..’ అంటూ రోదించిన తీరు అందరినీ కలచి వేసింది.
నోటితో శ్వాస అందించినా..
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగిన ఈ ఘటన అందరినీ కలచివేయడమే కాదు.. తన భర్త ప్రాణాలను కాపాడుకుంనేందుకు ఆమె పడిన వేదనను తెలుపుతోంది. కానీ.. చివరకు ఆమెకు రోదనే మిగిలింది.. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలోని ఉండే రవి సింఘాల్ (47) కొన్ని రోజులుగా కోవిడ్‌తో బాధ పడుతున్నాడు. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో అతడి భార్య రేణు సింఘాల్ బంధువులతో కలిసి ఆటో హాస్పిటల్‌కు బయలు దేరింది. ఈ క్రమంలో ఆటో ఉన్న రవికి ఆక్సిజన్ అందక కొన ఊపిరితో కొట్టుకుంటూ ఉన్నాడు.. తన భర్తను కాపాడుకునేందుకు రేణు తన నోటితో శ్వాస అందించింది. రవి ప్రాణాలు కాపాడేందుకు విశ్వప్రయత్నం చేసింది.. చివరకు ఆస్పత్రి చేరినా డాక్టర్లు పరీక్షించి రవి చనిపోయినట్లు తెలిపారు. భర్త మరణాన్ని తట్టుకోలేక రేణు గుండెలవిసేలా రోదించింది.
కరోనా గిరోనా జాన్తా నై…
ఇక ఇది ఓ వెరైటీ ప్రేమ కథ.. వింటే ఒకింత ఆశ్చర్యం వేసినా.. ప్రేమించిన వ్యక్తి కోసం ఆమె తీసుకున్న నిర్ణయానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే… కేరళకు చెందిన శరత్మోన్, అభిరామి కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకుందామని నిర్ణయించుకున్నారు. అయితే ఇటీవల శరత్మోన్ కరోనా పాజిటివ్ వచ్చింది.. కేరళలోని అలప్పుజ మెడికల్ కాలేజీలోని కోవిడ్ వార్డులో అతడు చికిత్స పొందుతున్నాడు. శరత్ తల్లి కూడా వైరస్ సోకి అదే వార్డులో ఉంది.. సాధారణంగా వివాహ సమయంలో ఏదైనా జరగరాని ఘటనలు జరిగితే.. పెళ్లి వాయిదా వేసుకుని మరో ముహూర్తం చూసుకుంటారు. కానీ, అభిరామి అలా చేయలేదు. ఏమైనా సరే అనుకున్న ముహూర్తానికే తన పెళ్లి కావాలని పట్టుబట్టింది. కలెక్టర్‌కు మెమోరాండం సమర్పించింది. ఇంకే ముంది ఆస్పత్రి వార్డే పెళ్లి వేదికైంది. సిబ్బందే పెళ్లి పెద్దలయ్యారు.. పీపీఈ కిట్ ముస్తాబై వచ్చిన వధువు అభిరామిని సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నాడు శరత్ మోన్..
అమ్మ కోసం అన్ని వదిలేసి వచ్చా..