Watch without difficulty : ఇబ్బంది లేకుండా చూడాలి

Watch without difficulty : ఇబ్బంది లేకుండా చూడాలి
  • జనగామ కలెక్టర్‌‌ శివలింగయ్య
  • ఆర్టీసీ బస్సుల్లో ఆకస్మిక తనిఖీ

జనగామ, చౌరాస్తా : మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య సూచించారు. మంగళవారం ఆయన జనగామ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సులో ప్రయాణిస్తున్న మహిళల ప్రయాణ సౌకర్యాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులు అందిస్తున్న సేవలు గురించి ఆయన మహిళా ప్రయాణికులతో మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం కండక్టర్లతో మాట్లాడుతూ మహిళా ప్రయాణికులు ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రయాణం కొనసాగించేందుకు వారికి సహకరించాలని సూచించారు. ఇప్పటి వరకు సుమారు 52 వేల మంది మహిళా ప్రయాణికులు మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో ప్రయాణం కొనసాగించారని డీఎం వివరించారు.

అధికారులతో కలెక్టర్​ సమీక్ష
కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా పంచాయతీ రాజ్, మిషన్ భగీరథ, జనగామ పట్టణ మున్సిపల్ అధికారులతో కలెక్టర్​ శివలింగయ్య మంగళవారం సమీక్షించారు. గ్రామాల్లో పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పరిశుభ్రత, త్రాగునీరు తదితర పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, పట్టణంలో జరుగుతున్న పచ్చదనం పరిశుభ్రత, తడి చెత్త, పొడి చెత్త సేకరణ, విద్యుత్, తాగునీరు సరఫరాలో ప్రజలకు హలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో ఇన్​చార్జి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సుహాసిని, జిల్లా పంచాయతీ అధికారి రంగాచారి, మిషన్ భగీరథ ఈఈ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ చంద్రమౌళి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని కథనాల కోసం..

వ్యవసాయమే నా లక్ష్యం..

అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్‌ జర్నలిస్ట్)

పొమ్మనలేక పొగ పెడుతున్నరు..

ఆటోనడిపిన పాలమూరు డెస్క్ జర్నలిస్ట్‌

ఉద్యోగం మానేకే అప్పు ముట్ట జెప్పిన

You may also like...