warangal police: నాలుగో సింహం.. తీరుమారట్లే..!

warangal police: నాలుగో సింహం.. తీరుమారట్లే..!
  • వరుస వివాదాల్లో ఓరుగల్లు పోలీసులు
  • సస్పెన్షన్ల వేటు పడుతున్నా.. తగ్గని ఖాకీలు
  • తాజాగా నర్మెట సీఐ, ఎస్సైపై సస్పెన్షన్‌

ఓరుగల్లు నాలోగో సింహం క్రమ శిక్షణ తప్పుతోంది. వరుస వివాదాల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతోంది. పోలీస్‌ బాస్​ సీరియస్‌ అయి కొరడా ఝులిపిస్తున్నా.. ఖాకీల తీరులో మార్ప రావడం లేదు. ఇందుకు వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో వరుసగా జరుగుతున్న పోలీసు అధికారుల సస్పెన్షన్ల ఘటనలే నిదర్శనం. ఇలాంటి కొందరు అవినీతి అధికారుల తీరు మొత్తం పోలీసు శాఖకే మాయని మచ్చ తెచ్చి పెడుతున్నాయి.



వరుస సస్పెన్షన్లు…

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఉన్న పీఎస్‌లో పలు వివాదాల్లో చిక్కుకుని చాలా మంది పోలీసులు సస్పెషన్లకు గురయ్యారు. తాజాగా జనగామ జిల్లా నర్మెట పీఎస్‌ సీఐ పి.నాగబాబు తోపాటు అదే స్టేషన్‌కు చెందిన ఎస్సై అనిల్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ఓ భూ వివాదంలో బాధితులపై అక్రమ కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేసిన కారణంగా నర్మెట సీఐ పి.నాగబాబు, ఎస్సై జి.అనిల్‌ను వరంగల్ సీపీ ఏ.వి రంగనాథ్ సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు సీపీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. నర్మెట మండలం అమ్మాపూర్‌ గ్రామానికి చెందిన‌ భూమి పంచాయితీలో బాధితులు కొన్ని రోజుల కింద పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు. అయితే దాదాపు 30 ఏళ్లుగా వారి స్వాధీనంలో ఉన్న భూమి ధరణిలో వేరే వాళ్ల పేరుపై ఉంది. దీనిని సాకుగా చూపి సీఐ నాగబాబు, ఎస్సై అనిల్‌ భూ కబ్జాదారులకు ఇప్పించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బాధితులు సీపీకి ఫిర్యాదు చేశారు. విచారణ జరిపించిన సీపీ రంగనాథ్ సీఐ, ఎస్సై తప్పు చేసినట్టు నిర్ధారణకు వచ్చారు. దీంతో ఇద్దరు పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు. గతంలో ఇదే పీఎస్‌లో అనిల్‌ కంటే ముందు ఇక్కడ పనిచేసి ఎస్సై నవీన్‌కుమార్‌‌ బచ్చన్నపేటకు బదిలీపై వెళ్లి కొద్ది రోజులకే సస్పెండ్‌కు గురయ్యారు. ఇక అంతకుముందు పనిచేసిన ఎస్సై రవికుమార్‌ ‌ కూడా అవినితీ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయన ఏకంగా లంచం తీసుకుంటూ ఏసీబీ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికారు.

నాడు తప్పినా.. నేడు చిక్కాడు..

నర్మెట సీఐగా పనిచేస్తున్న పి.నాగబాబుపై ఆది నుంచి ఆరోపణలే వినిపిస్తున్నాయి. ఇటీవల బచ్చన్నపేటలో జరిగిన రిటైర్డ్‌‌ ఎంపీడీవో రామకృష్ణ హత్య కేసులో కూడా నాగబాబుపై ఆరోపణలు వచ్చాయి. సీఐ నాగబాబుతో పాటు బచ్చన్నపేట ఎస్సై నవీన్‌కుమార్‌‌ నిందితులకు సహకారం అందిస్తున్నారని రామకృష్ణ బంధువులు ఆరోపణలు చేశారు. అయితే ఆ కేసులో అప్పట్లో ఎస్సై నవీన్‌కుమార్‌‌ను సస్పెండ్‌ చేశారు. ఇక ప్రస్తుతం నర్మెట ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న అనిల్‌ మంచి వాడనే పేరున్నా.. సీఐ నాగబాబు ప్రోద్బలంతోనే భూ వివాదంలో కబ్జాదారులకు సహకారం అందించాడనే పోలీసు వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇద్దరిపై వేటు పడినట్టు తెలుస్తోంది. మొత్తానికి సీఐ నాగబాబు నాడు రిటైర్ట్‌ ఎంపీడీవో కేసులో సస్పెన్షన్‌ నుంచి తప్పించుకున్నా.. నేడు చిక్కాడని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఏదీ ఏమైనా వివాదాల్లో కొట్టుమిట్టాడుతున్న జనగామ జిల్లా నర్మెట పీఎస్‌పై జిల్లా పోలీస్‌ బాస్‌ దృష్టి సారిస్తారా.. స్థానిక ప్రజలకు నమ్మకం కలిగిస్తారా.. వేచి చూడాలి మరి..!


పోలీసుల చుట్టూ భూవివాదాలు..

ఉమ్మడి జిల్లాలో గత కొన్ని నెలలుగా తలెత్తుతున్న భూవివాదాలు చాలా వరకు పోలీసులకే చుట్టుకుంటున్నాయి. లెక్కకైతే సివిల్‌ తగాదాలు పోలీసు కలుగజేసుకోవద్దని సీపీ రంగనాథ్‌ పలు మార్లు ఆదేశాలు జారీ చేశారు. అయితే చాలా పీఎస్‌లో రోజు భూమి పంచాయతీలే వస్తున్నాయి. ఈ లొల్లిల్లో అధికార పార్టీ లీడర్ల హస్తం ఉంటడంతో తప్పని పరిస్థితిలో స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్లు వారికి సపోర్ట్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో బాధితులు వారి పైఆఫీసర్ల వద్దకు వెళ్లడం షరా మామూలే అవుతోంది. ఇప్పటికే ఓరుగల్లు కమిషనరేట్‌ పరిధిలో అవినితీ అధికారుల చిట్టా పెద్దగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల వరకు ఉమ్మడి జిల్లాలోని చాలా మంది ఆఫీసర్లకు స్థాన చలనమో.. సస్పెన్షన్‌ వేటో తప్పదని ఆ శాఖలో పనిచేస్తున్న సిబ్బందే గుసగుసలాడుకుంటున్నారు.



మరిన్ని కథనాల కోసం..   click on …>  CHOURASTA_23.12.23 ff

వ్యవసాయమే నా లక్ష్యం..

అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్‌ జర్నలిస్ట్)

పొమ్మనలేక పొగ పెడుతున్నరు..

ఆటోనడిపిన పాలమూరు డెస్క్ జర్నలిస్ట్‌

ఉద్యోగం మానేకే అప్పు ముట్ట జెప్పిన

You may also like...