Trs party : గులా‘బీ’ టీం!

Trs party : గులా‘బీ’ టీం!

Trs party : గులా‘బీ’ టీం!

‘గులాబీ జెండాకు ఓనర్లం మేం..

పరిగ ఏరుకుంటే పంట పండించినట్లు కాదు..

పథకాలు ఇచ్చినంత మాత్రాన పేదరికం పోదు..

మంత్రి పదవిలో ఉండొచ్చు.. ఉండకపోవచ్చు.

నేను బాధపడుతుండొచ్చు. తనువు గాయపడి ఉండొచ్చు. కానీ మనసు మార్చుకోలేదు.!!’’

ఇవి సాక్షాత్తూ సీఎం కేసీఆర్​ సన్నిహితుడు, సీనియర్​ పార్టీ నేత, రాష్ట్ర మంత్రి రాజేందర్​ ఈటల పలికిన మాటలివి. కొంత కాలంగా ఇలాంటి ఆసక్తికర వ్యాఖ్యలతో మంత్రి  (trs-party) పార్టీలో కలకలం రేపుతున్నారు. అధిష్టానానికి షాక్​ల మీద షాక్​లు ఇస్తున్నారు. అంతటా చర్చనీయాంశమవుతున్నారు. ఈటల సౌమ్యుడు. వివాదాలకు దూరంగా ఉంటారు. తన పని తాను చేసుకుపోతాడు అనే పేరు ఉంది. కానీ  కొంత కాలంగా ఈటల మాటల తూటాలు టీఆర్ఎస్‌ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆయన  చేస్తున్న వ్యాఖ్యలు కారు పార్టీలో కల్లోకలం రేపుతున్నాయి. ప్రభుత్వ విధానాలు, లోపాలపై బాహాటంగానే ఎత్తి చూపుతున్నారు. ఇక పార్టీ స్థాపన నుంచి కేసీఆర్ వెన్నంటి ఉంటున్న వారిలో ఈటల మొదటి వరుసలో ఉంటారు.  తెలంగాణ రాకముందు ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా కేసీఆర్​ను వీడకుండా స్వరాష్ట్ర ఉద్యమంలోనూ ఆయన వెంట నడిచారు.

వైఎస్‌తో ఢీ అంటే ఢీ..

మాజీ నక్సలైట్​ అయిన ఈటల ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ ప్రభుత్వ పాలన కాలంలో అసెంబ్లీలో  టీఆర్​ఎస్​ ప్రతిపక్షనేత గా ఉన్నాడు. స్వరాష్ట్ర కాంక్ష పై వైఎస్​తో ఢీ అంటే ఢీ కొట్టారు. ప్రత్యేక రాష్ట్రం ఎందుకొద్దో చెప్పాలని వైఎస్​ను ఎదురించి డిమాండ్​ చేశాడు. ఒకసారి అసెంబ్లీలో ఈటల కారు డ్రైవర్​ ఎమ్మెల్యే జయప్రకాశ్​నారాయణను కొట్టగా, అప్పటి నుంచే  ఈటల పేరు ఉమ్మడి రాష్ట్రంలో మార్మోగింది. ఇక  తెలంగాణ వచ్చాక కేసీఆర్ కేబినెట్‌లో ఆర్థిక శాఖ మంత్రి పదవి దక్కింది. రెండోసారి కేబినెట్​లో వైద్యారోగ్య శాఖ మంత్రి పదవిలో ప్రస్తుతం కొనసాగుతున్నారు.

కేటీఆర్​ సీఎం ప్రచారంతోనే..

సీఎంగా కేటీఆర్ అవుతారని తలసాని, శ్రీనివాస్​గౌడ్​, అజయ్​ తదితర మంత్రులు, పార్టీ నేతలు జోరుగా ప్రచారం చేశారు. ఈ క్రమంలో కేటీఆర్ కేబినెట్‌లో కొత్త ముఖాలకు చోటు దక్కుతుందని, సీనియర్లు కొందరికి చోటు దక్కకపోవచ్చనే ప్రచారం నడిచింది. అయితే అనూహ్యంగా కొందరు ప్రతిపక్ష నేతలు జీవన్​రెడ్డి, జగ్గారెడ్డి, వీహెచ్​, కులసంఘాల నాయకులు ఆర్​. కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్​గౌడ్​ లాంటి వారు సీఎంగా  ఈటల రాజేందర్​ను ఎందుకు చేయరని సీఎం కేసీఆర్​ను ప్రశ్నించారు. దీనిపై ఆయనను ఇరుకున పెట్టారు. దీనికి ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. కేటీఆర్‌‌ను కాదని ఈటలకు సీఎం పదవి దక్కడం సాధ్యం కాదు. ఒకవేళ కేటీఆర్ కొద్దిరోజుల తర్వాత సీఎం అయినా, వెంటనే ఈటలను కేబినెట్​ నుంచి తొలగించ లేడు. ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి ఉంటుంది. అయితే మొదటిసారి ఈటల చేసిన వ్యాఖ్యలతో కేసీఆర్ కు ఆయనకు మధ్య గ్యాప్ వచ్చిందనే ప్రచారం వచ్చింది.  కానీ రెండోసారి ప్రభుత్వంలో ఈటలకు మంత్రి పదవి దక్కదేమో అనే చర్చలు జోరుగా సాగాయి.

అప్పటి నుంచే అసంతృప్తి 

2018లో రెండోసారి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచే  మంత్రి ఈటల రాజేందర్‌లో అసంతృప్తి నెలకొన్నట్టు తెలుస్తోంది. అప్పటి మంత్రి వర్గంలో ముందుగా ఈటల పేరు చేర్చలేదు. దీనిపై విమర్శలు రావడంతో సీఎం కేసీఆర్‌ చివరి నిమిషంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించినట్లు ప్రచారం జరిగింది. అప్పటి నుంచే అవమానం జరిగిందని తెలుస్తోంది. ఈటల మనసు గాయపడ్డట్టు  పలు సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలతోనే అర్థమవుతోంది. మరోవైపు ఈటల చెక్​ పెట్టేందుకు మంత్రివర్గ విస్తరణలో భాగంగా గంగుల కమలాకర్‌కు మంత్రి పదవి ఇచ్చారనే ప్రచారమూ కొనసాగింది. కానీ కేసీఆర్, ఈటల మధ్య గ్యాప్​ కొంతకాలమే వచ్చింది. మళ్లీ సీఎం కేసీఆర్​ ఈటలను పిలిపించుకుని మాట్లాడి దగ్గరకు తీశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు జోష్​లో ఉండగా..

ఒకవైపు రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలిచిన జోష్​లో  పార్టీ నాయకులు సంబురాలు చేసుకుంటుంటే, మళ్లీ ఈటల తనలోని అసంతృప్తిని కరీంనగర్​ జిల్లాలో రైతు వేదిక సభలో బహిరంగంగానే వ్యక్తం చేశారు.  ఇక ఇటీవల అసెంబ్లీ సమావేశాలు  మంత్రి  కేటీఆర్​ తన కారులో ప్రగతి భవన్​కు ఈటలను తీసుకెళ్లడం చర్చనీయాంశమైంది. వారు పలు అంశాలపై మాట్లాడుకున్నట్లు తెలిసింది. దీనిపై ఈటల ‘ఆ ఒక్కటి తప్పా’ ఏది అడిగినా సమాధానం ఇస్తానని మీడియాకు వివరణ ఇచ్చారు.  ఏం చర్చించుకున్నారనేది తెలియకపోయినా ​ ఈటలను సీఎం కేసీఆర్ ఘాటుగానే మందలించినట్టు తెలుస్తోంది.  కేటీఆర్‌తో ప్రగతిభవన్‌కు వెళ్లి మధ్యాహ్న భోజనం చేసి వచ్చిన ఈటల మనసు మార్చుకుంటాడా..! (trs-party) పార్టీలోనే కొనసాగుతాడా.. ! లేక బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టి.. గులాబీ ‘బీ’ టీమ్​ను తయారు చేస్తాడా..! అనేది తేలాల్సి ఉంది.!

Trs party : గులా‘బీ’ టీం!

మరిన్ని కథనాల కోసం..

ఆచార్య, సిద్ధ వచ్చేశారు..

అమ్మ కోసం అన్ని వదిలేసి వచ్చా..

అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్‌ జర్నలిస్ట్)

ఆటోనడిపిన పాలమూరు డెస్క్ జర్నలిస్ట్‌

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *