tallywood : టాలీవుడ్‌లో ‘అన్నల’ ఆట

tallywood : టాలీవుడ్‌లో ‘అన్నల’ ఆట

tallywood : టాలీవుడ్‌లో ‘అన్నల’ ఆట

…………. ఉప్పలంచి నరేందర్……………

‘ప్రతీ 30 సంవత్సరాల కోసారి బతుకు తాలూకు ఆలోచన మారుతుంది.. సినిమావాళ్లు దాన్ని ట్రెండ్‌ అంటారు.. వ్యాపారవేత్తలు ఫ్యాషన్‌ అంటారు.. రాజకీయనాయకులు తరం అంటారు.. మామూలు జనం జనరేషన్‌ అంటారు.. కానీ.. ప్రతీ జనరేషన్‌లో ఆ కొత్త థాట్‌ను ముందుకు తీసుకెళ్లావాడు మాత్రం ఒక్కడే వస్తాడు.. వాన్నే టార్చ్ బ్యారర్‌‌ అంటారు..’ ఏంటీ ఈ డైలాగ్‌ ఎక్కడో విన్నట్టుంది అనుకుంటున్నారు.. కదా.. ఆ.. ఆ.. అదే.. అదే.. మీ నోట్లో ఉన్న పేరే.. ‘అరవింద సమేత వీరరాఘవరెడ్డి’ సినిమాలోనిది.. ‘త్రివిక్రమ్‌’ కలం నుంచి జాలువారి.. ‘రావు రమేశ్‌’గళం నుంచి వినిపించిన ఈ డైలాగ్‌కు ‘అన్నల సినిమా’లకు లింక్‌ ఏంటీ అనుకుంటున్నారా..! అసలు విషయానికి వస్తున్నా పదండి..

తెలుగు చలనచిత్ర పరిశ్రమ (tallywood) కూడా ఇప్పడు అదే 30 ఏళ్ల మార్పు వైపు అడుగులేస్తున్నట్లు అనిపిస్తోంది. అదేలా అంటారా నిన్నమొన్నటి వరకు లవ్‌, ఫ్యాక్షన్‌ స్టోరీలు, పాంటసీ, కామెడీ కథలతో సినిమాలు తీసిన దర్శక, నిర్మాతలు ట్రెండ్‌ మార్చుకుని మెల్లమెల్లగా ‘విప్లవం’ వైపు పయనించేందుకు రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇందుకు ఇటీవల కాలంగా వస్తున్న కొత్త సినిమాల ట్రైలర్లను చూస్తే అర్థమవుతుంది.

విప్లవం అంటే.. పీపుల్స్‌ స్టారే…

1990 నుంచి 2000 సంవత్సరం వరకు విప్లవ సినిమాలకు మంచి ఆధరణ ఉండేది. ఇక ఈ సినిమాలకు పీపుల్స్‌ స్టార్‌‌ ఆర్‌‌.నారాయణమూర్తి కేరాఫ్‌గా ఉండేవారు. ఆయన నటించిన లాల్‌ సలాం, దండోరా, ఎర్రసైన్యం, ఓరేయ్‌ రిక్షా, అరణ్యం, దండకారణ్యం సినిమాలు అప్పట్లో మామూలు హిట్స్‌ కావు. ఆయన సినిమాలు చూసేందుకు జనం కిలోమీటర్లు నడిచి వెళ్లేవారు. ఊరంతా ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు కట్టుకుని వెళ్లి థియేటర్లలో పీపుల్స్‌ స్టార్‌‌ పాటలకు స్టెప్పులు వేసేవారు.

tallywood : టాలీవుడ్‌లో ‘అన్నల’ ఆట

2000 మిలీనియం నుంచి పెరిగిన పాశ్చత్య సంస్కృతితో మెల్లమెల్లగా విప్లవ సినిమాలు తగ్గిపోయాయి. పెత్తందారీ వ్యవస్థ.. పెట్టుబడిదారి వ్యవస్థగా రూపు మార్చుకుని చిత్రపరిశ్రమలోకి వచ్చింది. యూత్‌కు ర్యాంప్‌, రాక్‌ డ్యాన్స్‌.. లవ్‌ మసాలా.. అలవాటు చేసింది. అలా విప్లవ సినిమాలకు పూర్తిగా బ్రేక్‌ పడింది.. మధ్యలో ఓసారి రియల్‌ స్టార్‌‌ శ్రీహరి ‘కుబుసం’ మూవీతో విప్లవ గీతాన్ని నిపించాడు. ఆ తర్వాత ఎప్పుడో అప్పుడు ‘గమ్యం’లాంటి కొన్ని చిత్రాల్లో మాత్రమే అన్నల సీన్స్‌ కనిపించాయి. ఎంత మార్పు వచ్చినా పీపుల్స్‌ స్టార్‌‌ నారాయణమూర్తి మాత్రం తన పంథా మార్చుకోలేదు.. హ్యాటఫ్‌ కామ్రెడ్‌..

tallywood : టాలీవుడ్‌లో ‘అన్నల’ ఆట

విరాటపర్వం..

దాదాపు 20 ఏళ్ల తర్వాత టాలీవుడ్‌లో ‘పీపుల్స్‌ వార్‌‌’ టైపులో పోస్టర్‌‌ రిలీజ్‌ అయిన చిత్రం విరాటపర్వం.. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. వేణు ఉడుగుల దాదాపు రెండేళ్లుగా ఈ చిత్రం కోసం శ్రమిస్తున్నారు. గతంలో రిలీజ్‌ అయిన మూవీ పోస్టర్‌, ఆర్టిస్టుల ఫస్ట్‌ లుక్‌లు, ఇటీవల విడులైన టీజర్‌.. మళ్లీ మట్టి మనుషులు.. వెట్టి బతుకులను తట్టి లేపుతున్నట్లుగా ఉన్నాయి. ‘ఆదిపత్య జాడలనే.. చేరిపేయగ ఎన్నినాళ్లు.. తారతమ్య గోడలనే పెకిలించగ ఎన్ని నాళ్లు.. దున్నేటోడి వెన్ను విరిచి భూస్వాములు ధని కులైరి..’ అంటూ హీరోతో…, ‘దొంగ లంజడి కొడుకా..’ అంటూ హీరోయిన్‌తో చెప్పించిన ఆ డైలాగ్స్‌ వింటే వేణు ఉడుగుల పెద్ద సాహసమే చేశాడు అనిపిస్తోంది. ప్రస్తుతం రీరికార్డింగ్ పనుల్లో ఉన్న ‘విరాటపర్వం’ ఏప్రిల్‌ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

tallywood : టాలీవుడ్‌లో ‘అన్నల’ ఆట

ఆకట్టుకుంటున్న ఆచార్య..

ఇక మెగాస్టార్‌‌ చిరంజీవి ‘ఆచార్య’ మూవీపై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ టైటిట్‌ రిలీజ్‌పై డైరెక్టర్‌‌ కొరటాల శివ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ.. చిరు ఓ సినీ వేదికలో ఎమోషనల్‌ అయ్యి.. ‘ఆచార్య’ అంటూ పేరును ప్రకటించారు. ఇక అప్పట్లో అంతా ‘మాస్టర్‌‌’ వంటి సినిమానే కావొచ్చు అనుకున్నారు. ఇక.. ఇటీవల ‘విరాటపర్వం’ టీజర్‌‌ రిలీజ్‌ టైంలో మెగాస్టార్‌ మరో మారు స్లిప్‌ అయి ‘ఆచార్య’ కూడా నక్సల్స్‌ కథ అంటూ చెప్పేశారు. రాంచరణ్‌ బర్త్‌ డే సందర్భంగా శనివారం రిలీజ్‌ చేసిన చెర్రీ ఫస్ట్‌ లుక్‌లో పోస్టర్‌ దానికి మరింత బలాన్నిచ్చింది.  చిరు, రాంచరణ్‌ ఇద్దరు నక్సలైట్ల డ్రెస్సుల్లో తుపాకీలు పట్టుకుని నడుకుంటూ ఉన్న ఈ పోస్టర్‌‌లో బ్యాక్‌ గ్రౌండ్‌లో తడకలతో ఉన్న ఎనుగు పల్లెటూరి వాతావరణం కనిపిస్తోంది. చిరంజీవి గతంలో మగధీర, బ్రూస్‌లీ చిత్రాల్లో చెర్రీ పక్కన గెస్ట్‌ రోల్‌లో ఓ మెరుపు మెరిసారు. ఇక ఆచార్యలో ఇద్దరు ఫుల్‌ లెన్త్‌ హీరోలుగా కనిపించనున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మే 13న విడుదలకు రెడీ అవుతోంది.

అయితే  నాటి విప్లవ సినిమాలన్నీ.. భూమి కోసం, బువ్వ కోసం కొట్లాడిన కథలే.. అలా పోరాడి అమరులైన వారి వ్యథలే.. కానీ, ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి.. నాటి భూస్వాములంతా ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుని జెండాలు, ఎజెండాల పేరుతో తిరుగుతున్నారు. ఊళ్లకు ఊళ్లు కబ్జాలు చేస్తూ.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలతో కోట్లకు పడగెత్తారు.. చూడాలి మరి.. ఈ ‘అన్నల’ చిత్రాలు.. వారిని ప్రశ్నిస్తాయా..!   

మరిన్ని కథనాల కోసం..

ఆచార్య, సిద్ధ వచ్చేశారు..

అమ్మ కోసం అన్ని వదిలేసి వచ్చా..

అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్‌ జర్నలిస్ట్)

అక్షరయోధుడు.. ధృవ

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *