provide better services : మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం
- ప్రజాపాలన ప్రత్యేక అధికారి వాకాటి కరుణ
- రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్‌లో దరఖాస్తుల పరిశీలన
జనగామ, చౌరాస్తా : ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రజాపాలన ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి వాకాటి కరుణ తెలిపారు. ప్రజా పాలనలో భాగంగా జిల్లాలో కొనసాగుతున్న దరఖాస్తు స్వీకరణను ఆమె పరిశీలించారు. ఈ మేరకు జనగామ జిల్లాలోని రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి, స్టేషన్‌ఘన్‌పూర్ మండల కేంద్రంలోని దరఖాస్తు కేంద్రాలను కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య, అదనపు కలెక్టర్ పర్మార్ పింకేశ్ కుమార్‌తో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రజా పాలన దరఖాస్తు కేంద్రాలను పకడ్బందీగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తున్నామన్నారు. లబ్ధిదారులకు కావాల్సిన అన్ని దరఖాస్తులు సంబంధిత కేంద్రాలలో సిద్ధంగా ఉంచామని ఆమెకు వివరించారు.
ప్రజా పాలన దరఖాస్తుల సమర్పణ, ఏదైనా సందేహాలు, సలహాలు, సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంటున్నారని వివరించారు. ప్రజలు ఏమైనా సమస్యలు, సందేహాలు ఉంటే కంట్రోల్ రూమ్ లోని 8716 293880 నంబర్‌లో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో డీసీపీ సీతారాం, స్టేషన్‌ఘన్‌పూర్ ఆర్డీవో రామ్మూర్తి, డీఏవో వినోద్ కుమార్, స్థానిక ఎంపీడీవో, తహసీల్దార్, సంబంధిత ప్రజాపాలన ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)