Politics of Janagaon : తెరవెనక అంతా ఒక్కటే..!

jangaon leaders : తెరవెనక అంతా ఒక్కటే..!
  • జనగామలో రెడ్లదే ఆదిపత్యం
  • అన్ని పార్టీల్లోనూ అదే తంతు
  • బహుజనులను తొక్కేసే ప్రయత్నమేనా..!

రాష్ట్రంలో 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఏన్నో ఏళ్లుగా పాలితులుగానే ఉంటున్నారు. 10 శాతం  కూడా లేని రెడ్లే పాలకులుగా చెలామణి అవుతున్నారు. జనగామ విషయంలో కూడా అదే జరుతుతోంది. దాదాపు అన్ని ప్రధాన పార్టీల్లో పాగా వేసిన (jangaon leaders) వారంతా ప్రజల ముందు వైరం ఉన్నట్టు ఉంటూనే తెరవెనుక అంతా ఒక్కటిగానే ఉంటున్నట్టు తెలుస్తోంది. బహుజనులను ఎదగనీయకుండా ప్లాన్‌ చేస్తూ ముందుకు సాగుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.



jangaon leaders : తెరవెను అంతా ఒక్కటే..!

ముత్తిరెడ్డి కథ ఇదీ..

2010 తర్వాత హైదరాబాద్ నుంచి జనగామకు వచ్చిన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి 2014, 2018 రెండు దఫాల్లో టికెట్ తెచ్చుకుని ఎమ్మెల్యేగా గెలుపొందారు. తన బావమరిది సంపత్ రెడ్డిని తన తర్వాత ద్వితీయ శ్రేణి నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేసిన ఆయన..  నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ రెడ్డీలను పెట్టుకొని పాలన సాగిస్తున్నాడనే అపవాదు ఉంది. బచ్చన్నపేట మండలంలో సతీశ్ రెడ్డి, బొడిగం చంద్రారెడ్డి, అనిల్ రెడ్డి, చేర్యాల మండలంలో శ్రీధర్ రెడ్డి, పెడతల ఎల్లారెడ్డి, రాజీవ్ రెడ్డి, మద్దూరు, నర్మెట మండలాల్లో బద్దిపడగ కృష్ణారెడ్డి, పెద్ది రాజిరెడ్డి, తరిగొప్పులలో పింగిళి జగన్మోహన్ రెడ్డి, బీరెడ్డి జార్జిరెడ్డి ఇలా ప్రతీ మండలంలో ఇద్దరు ముగ్గురు రెడ్డీలను సామంత పాలకులుగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. వారితో మండలంలో సెటిల్‌మెంట్లకు తెరలేపారన్న విమర్శలు ఉన్నాయి. భూ సెటిల్‌మెంట్‌లో అడ్డొచ్చినందుకు ఇటీవల బచ్చన్నపేటలో మాజీ ఎంపీడీవో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సతీశ్‌రెడ్డిపై బాధిత కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు బీసీ నిందితుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కానీ.. సతీశ్ రెడ్డిపై కేసు ఫైల్ చేయలేదు. ఆ వర్గం వారికి అందుతున్న రాజకీయ అండదండలకు ఈ ఘటనే నిదర్శనంగా చెప్పవచ్చు. తాజాగా వార్తల్లో నిలుస్తున్న ముత్తిరెడ్డి బిడ్డ తుల్జభవానీరెడ్డి అడుగుల వెనుక కూడా ఏదో ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది ఆ సామజిక వర్గం వారిలో వారికే సఖ్య కుదరడం లేదని కూడా తెలుస్తోంది. ముత్తిరెడ్డి నమ్మిన వారే ఆయన వెను గోతులు తీస్తూ మరో నేత అయిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌‌రెడ్డికి సపోర్ట్‌ చేస్తున్నారు. ఇందుకు ఇటీవల హైదరాబాద్‌ టూ రిజం ప్లాజాలో జరిగిన  ఘటనే నిదర్శనంగా చెప్పొచ్చు. అయితే ఎన్ని గొడవలు వచ్చినా సామాజికవర్గం కోణంలో వచ్చే సరికి తామంతా ఒక్కటే అని ఆ వర్గం నేతలే అంటుండం గమనార్హం.




jangaon leaders : తెరవెను అంతా ఒక్కటే..!

‘కొమ్మూరి’ది మరో కథ..

భూస్వామ్య కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన కొమ్మూరి 2004, 2008 ఉప ఎన్నికలో టీఆర్ఎస్ నుంచి చేర్యాల ఎమ్మెల్యేగా గెలిచాడు. 2009లో జనగామ నియోజకవర్గంలో పొన్నాల చేతిలో ఓడిన కొమ్మూరిని 2011లో పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో, బీజేపీలో చేరి 2014లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. 2018లో కాంగ్రెస్‌ లో చేరి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడాడు. ఇటీవల డీసీసీ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన జనగామ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఇటీవల ఎమ్మెల్యే ముత్తిరెడ్డి చేర్యాల పెద్ద చెరువు మత్తిడి స్థలం గురించి మాట్లాడుతూ.. కొమ్మూరితో తనకు ఉన్న అనుబంధాన్ని చెప్పకనే చెప్పారు. తాను కొమ్మూరి ఇంజినీరింగ్ కాలేజీ కోసం డబ్బు ఎలా ఇచ్చిండో వివరించారు. ఎమ్మెల్యేగా ఉండి కొమ్మూరి చేర్యాలలో వెంచర్ వేస్తుంటే మిన్నకుండిన ముత్తిరెడ్డి.. వెంచర్ లో ప్రజావసరాల కోసం మున్సిపాలిటీకి స్థలం విడిచిపెట్టలేదని, జనం భూమి కబ్జాచేశాడని ఇప్పుడు ఆరోపణలు చేయడం గమనార్హం. అంటే ఇంతకాలం ఒక అవగాహనతో సాగిన వీళ్లిద్దరూ ఇప్పుడు స్పర్థలు రాగానే ఇలా ఆరోపణలు చేసుకుంటూ అసలు సంగతులు బయట పెట్టుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే జనగామలో జరుగుతున్న రెడ్ల తెరవెనుక రాజకీయాలు అర్థం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.


jangaon leaders : తెరవెను అంతా ఒక్కటే..!

‘ఆరుట్ల’ తీరిది..

ప్రస్తుతం బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆరుట్ల దశమంత్‌రెడ్డి తొలుత ఓయూలో ఏబీవీపీ లీడర్‌.. చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీతో జనగామ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత టీఆర్‌‌ఎస్‌లో చేరిన ఆయన 2018లో ఆ పార్టీ టికెట్‌ కోసం ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు. దీంతో ముడేళ్ల కింద బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చిన కొద్ది రోజులకే పార్టీ జిల్లా అధ్యక్ష పీఠం అప్పగించింది. దీంతో ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న కొందరు డీలా పడ్డారు. అయినా ఆరుట్ల అందరినీ కలుపుకుని పోతారని భావించారు. కానీ ఆయన కొందరికే ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ కోసం పనిచేసిన లీడర్లను పట్టించుకోకుండా మొక్కుబడి ప్రోగ్రామ్స్‌ చేస్తున్న ఆరుట్లపై సొంత లీడర్లే (jangaon leaders) విమర్శలు చేస్తున్నారు. కొందరైతే ఏకంగా పార్టీకి చెందిన సోషల్‌ మీడియాలోనే బహిరంగ పోస్టులు పెడుతుండడం గమనార్హం.


మొత్తానికి ప్రజల నుంచి నాయకుడిగా గుర్తింపు పొంది పైకి రావాలన్న తమను అగ్రవర్ణాల లీడర్లు తొక్కేస్తున్నారని ఆయా పార్టీల్లోని కొందరు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులు గుర్రు మీద ఉన్నారు. అది కాస్తా తారా స్థాయికి చేరితే రాజ్యాధికారం కోసం బహుజనులు మరో పోరాటం పుడుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

  • బీసీలను గుర్తించాలి..

జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలను అన్ని పార్టీలు ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయి. జనగామలో అయితే ఆది నుంచి రెడ్ల పాలిస్తున్నారు. బీసీ నేతలకు ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా అణగదొక్కుతున్నారు. ఒక్క కాంగ్రెస్‌ పార్టీలో మాత్రమే మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య బీజీ నేతగా ఎదిగారు. ఇప్పటికైనా అన్ని పార్టీలు బీసీ లీడర్లును గుర్తించాలి. 

jangaon leaders : తెరవెను అంతా ఒక్కటే..!

– లొక్కుంట్ల ప్రవీణ్‌, కాంగ్రెస్‌ ఓబీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు

 

బహుజనులు ఏకం అవుతున్నారా.!  (త్వరలో..)

మరిన్ని కథనాల కోసం..

వ్యవసాయమే నా లక్ష్యం..

అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్‌ జర్నలిస్ట్)

పొమ్మనలేక పొగ పెడుతున్నరు..

ఆటోనడిపిన పాలమూరు డెస్క్ జర్నలిస్ట్‌

ఉద్యోగం మానేకే అప్పు ముట్ట జెప్పిన


You may also like...