naxals vs Police : ఉత్తర తెలంగాణ ఎవరిది!

naxal vs Police : ఉత్తర తెలంగాణ ఎవరిది!

naxal vs Police : ఉత్తర తెలంగాణ ఎవరిది!

naxals vs Police : ఉత్తర తెలంగాణ ఎవరిది!

బూర్జువ పార్టీల ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతూనే.. అడవుల నుంచి జన‘తన’ సర్కార్ నడపాలని ఓ వైపు అన్నల ఆరాటం.. వారిని రాష్ట్ర బార్డర్ కూడా తొక్కనీయవద్దని ఖాకీల పోరాటం.. ఎవరికి వారు వ్యూహత్మకంగా అడుగులు వేస్తూ పట్టు బిగించేందుకు ప్రయత్నా లు చేస్తున్నరు. (naxal vs Police).. అసలు ఉత్తర తెలంగాణ ఎవరిది..? ఇక్కడ ఎవరి బలం ఎంత ఉంది.
1990 వరకు పెట్టని కోటలే..

ఉత్తర తెలంగాణ జిల్లాలు 1990 వరకు మవోయిస్టులకు పెట్టని కోటలాంటి ప్రాంతాలు. గ్రామాల్లో సానుభూతిపరులు, కొరియర్ల.. అడవుల నిండా దళాలతో అటు రాజకీయ నాయకులు, ఇటు పోలీసులకు ముచ్చెమటలు పట్టించేవారు. చంద్రబాబునాయుడు సీఎం అయిన తర్వాత గ్రేహౌండ్స్ దళాలను ప్రవేశపెట్టడంతో అన్నల ఉనికే ప్రశ్నార్ధకమైంది. దీంతో ఉన్న దళాలను కాపాడుకునేందుకు మవోయిస్టులు మొత్తం దండకారణ్యానికి మకాం మార్చుకుని షెల్టర్ జోన్లను ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి అప్పుడప్పుడు తమ ఉనికిని చాటుకుంటూ వస్తున్నారు.
పూర్వ వైభవం కోసం..

కరోనా సమయంలో దేశమంతా స్తబ్ధుగా ఉన్న సమయంలో మవోయిస్టులు చాపకింద నీరులా కేడర్‌ను రిక్రూట్ చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అలా దళాల సంఖ్యను పెంచుకున్న మావోయిస్టు పార్టీ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోన్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ రాష్ట్ర కేడర్‌‌కు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. దీంతో ఉత్తర తెలంగాణలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో వారు పార్టీ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారు. అందుకు ప్రత్యేకంగా కమిటీలను కూడా ఏర్పాటు చేసిన నాయకత్వం.. చాలా సీరియస్ గా వర్క్ చేస్తున్నట్లు తెలిసింది. (naxals vs Police)
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..

ఉత్తర తెలంగాణలో పార్టీ బలంగా ఉన్న సమయంలో మవోలపై దాడులు, ప్రతిదాడులు జరిగితే షెల్టర్ జోన్‌గా భద్రకాళి గుట్టను ఉపయోగించుకునే వారు. ఈ మేరకు దండకారణ్య అటవీ ప్రాంతంలోని శివారు ప్రాంతాన్ని తెలంగాణ కమిటీకి అప్పగిస్తూ రెండు దశాబ్దాల క్రితమే కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆ తరువాత జరిగిన పరిస్థితుల ప్రభావంతో రాష్ట్రంలో మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. దీంతో సాయుధ దళాలన్ని కూడా దండకారణ్యం (డీకే) ఏరియాలోని షెల్టర్ జోన్ కే పరిమితమయ్యాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో దండకారణ్యం వదిలి తెలంగాణ అడవులకు వెళ్లాలని కేంద్ర కమిటీ ఆదేశించింది.

naxal vs Police : ఉత్తర తెలంగాణ ఎవరిది!

కేంద్ర కమిటీ ఏం చెప్పింది..?

ఉత్తర తెలంగాణలో పార్టీ బలోపేతానికి కేంద్ర కమిటీ పలు కీలక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఇక నుంచి తెలంగాణ ప్రాంతంలో సంచరిస్తూ పార్టీ నిర్మాణం కోసం ప్రయత్నించాల్సిందేనని తేల్చి చెప్పినట్లు తెలిసింది. ఇందుకోసం ఏర్పాటు చేసిన సీసీ కమిటీ ముందుగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో పర్యటించి రిక్రూట్ మెంట్ కోసం చర్యలు చేపట్టాలని సూచించినట్లు సమాచారం. వచ్చే ఏప్రిల్ వరకు తెలంగాణ అటవీ ప్రాంతాల్లోనే తిరుగుతూ పార్టీని బలోపేతం చేయాలని, అప్పటి వరకు తెలంగాణ కేడర్ కు డీకే ఏరియాలో షెల్టర్ జోన్ ఉండదని కూడా స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో పార్టీకి చెందిన యూజీ కేడర్ ఆసిఫాబాద్ నుంచి భద్రాద్రి జిల్లా వరకు ప్రవహిస్తున్న గోదావరి, ప్రాణహిత, ఇంద్రావతి నది పరివాహంలోని అడవులకు వచ్చి చేరినట్లు తెలుసింది.
పోలీసుల వ్యూహం ఇదే..

తెలంగాణలో మావోయిస్టులు అడుగు పెట్టారన్న వార్తతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఇప్పటికే అడవుల్లోకి గ్రే హౌండ్స్‌ దళాలు అడుగుపెట్టాయి. మావోలు నార్త్ తెలంగాణలో అడుగుపెట్టి సాయధ దళాల నిర్మాణం జరిగితే వారిని ఏరి వేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయని పోలీసు ఆఫీసర్లు భావిస్తున్నారు. గత వైభవం కోసం మావోయిస్టులు ప్రయత్నిస్తున్న క్రమంలోనే చెక్ పెట్టేస్తే ముందు ముందు ఇబ్బందులు ఉండవని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్ గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు పోలీసు బాసులు మానిటరింగ్ చేస్తూ మావోల ఏరివేతపై స్పెషల్ గా రివ్యూ చేస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో గ్రే హౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుంటే లా అండ్ ఆర్డర్ పోలీసులు ఇన్ ఫార్మర్ వ్యవస్థను అప్రమత్తం చేయడంతో పాటు అనుమానితులపై నిఘా వేశారు.
అంతా ఎస్ఐబీ గుప్పిట్లోనే..

మరోవైపు మావోల ప్రభావం ఉండే అవకాశాలు ఉన్న ప్రాంతాలను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఎస్ఐబీ) తన కంట్రోల్లోకి తీసుకుంది. ఆయా ప్రాంతాల్లో పోలీసు అధికారుల పోస్టింగ్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటోంది. అలాగే రామగుండం కమిషనరేట్ లో కూడా తాజాగా పోస్టింగ్ అయిన ఐపీఎస్ శరత్ చంద్ర పవార్ కు ఆపరేషన్స్ అడిషనల్ డీసీపీ బాధ్యతలు అప్పగించారు. కమిషనరేట్లలో ఇప్పటి వరకు అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్లకు మాత్రమే అడిషనల్ డీసీపీలు ఉండేవారు. కానీ, ఉండగా రామగుండం కమిషనరేట్‌లో కొత్తగా ఆఫరేషన్స్ వింగ్ కు ఇంచార్జిగా బాధ్యతలు అప్పగించడం విశేషం.

మరిన్ని కథనాలు..

కష్టకాలంలో ఆటో నడిపిన డెస్క్‌జర్నలిస్ట్

నక్సలిజం నుంచి జర్నలింజం వైపు వచ్చి..

జీతం కోసం చేరి జీవితంగా మార్చుకుని..

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *