media : జర్నలిస్టుల విలువల వలువలు విప్పేస్తున్న ‘మీడియా’

media values : విలువల వలువలు విప్పేసిన ‘మీడియా’
  • ప్యాకేజీని బట్టి అభ్యర్థికి వేయిటేజి..
  • వండి వారుస్తున్న కథనాలు ఎన్నో..

ప్రజాస్వామానికి నాలుగో స్తంభంగా చెప్పుకుంటున్న ‘మీడియా’ ఎన్నికల వేళ దిగజారుతోందా..? రాజకీయ నాయకులు విసిరే డబ్బులకు దాసోహం అవుతుందా..? అంటే అవును అనే సమాధానం వస్తోంది. ప్యాకేజీల వేట పడి అటు యాజమాన్యాలు, ఇటు స్థానికంగా ఉన్న జర్నలిస్టులు తమ వృత్తి ‘విలువల వలువలు విప్పేసుకుని’ అభ్యర్థులను ప్రసన్నం చేసుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ప్యాకేజీలు ఇచ్చారా.. వారికి దాసోహమై నిత్యం వార్తలను వండి వారుస్తూ అభ్యర్థుల వేయిటేజీ పెంచే పనిలో ఉంటున్నారు. ఇక ప్యాకేజీ అందలేదా అంతే.. వ్యతిరేక వార్తలతో అభ్యర్థిని ముప్పుతిప్పలు పెట్టి దారిలోకి తెచ్చుకోవడమే పనిగా పెట్టుకుంటున్నారు.



సర్వం ప్యాకేజీ మయం..
నిజానికి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ప్రచారానికి ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియాలో యాడ్స్‌ ఇచ్చుకోవాలి. వీటికి సంబంధించిన ఖర్చులు చూపిస్తే అభ్యర్థి తనకు ఇచ్చిన ఖర్చు టార్గెట్‌ కంటే ఎక్కువ అవుతుంది. దీనిని తప్పించేందుకు మీడియా సంస్థలు ‘ప్యాకేజీ’లను తెరపైకి తెచ్చాయి. అలా ప్యాకేజీ వార్తకు గతంలో యాజమాన్యాలు ADVT అని వేసి.. ఎంతో కొంత బిల్‌గా చూపించేవి. కానీ ఇప్పుడు అది కూడా ఎత్తేసి.. అభ్యర్థి ప్రచారాన్ని వార్త రూపంలో ప్రచురిస్తూ, ప్రసారం చేస్తూ.. ‘స్వామి కార్యం.. స్వకారంగా..’ ముందుకు సాగుతున్నాయి. ఓ విధంగా ఈ చర్యలు ఎలక్షన్‌ కమిషన్‌ను తప్పుదోవ పట్టించి యాజమాన్యాలు అభ్యర్థులకు ప్రచారం ఇవ్వడమే అవుతుంది. అయితే ప్రస్తుతం మీడియాతో పాటు సోషల్‌ మీడియా కూడా తోడు అవ్వడంతో అభ్యర్థులకు ‘ప్యాకేజీ’ల తాకిడి ఎక్కువై తలలు పట్టుకుంటున్నారు.




అ‘విశ్వాసం’..
వాస్తవానికి మీడియా ప్రపంచానికి అద్దం లాంటిది. ఇందులో పనిచేసే వారు నిజాలు, వాస్తవాలను ప్రజలకు వివరిస్తూ వారిని చైత్యం చేసేందుకు ముందుండాలి. ముఖ్యంగా ఎన్నికల వేళ మీడియా కీలకంగా పనిచేయాలి. అలాంటి మీడియాను, జర్నలిస్టులను ప్రతి ఒక్కరూ విశ్వసిస్తారు. కానీ, అలాంటి మీడియా ఎక్కడైనా ఉందా..? అలాంటి జర్నలిస్టులను ఎవరైనా ఉన్నారా..? అనే ప్రశ్నలకు ప్రస్తుతం జవాబు దొరకడం కష్టమే.. ఇక ఎక్కడో ఒక చోట ఉన్నా.. ఎర్రం నర్సింగరావు ( సీనియర్‌‌ జర్నలిస్ట్‌ హైదరాబాద్‌) లాగా ఎప్పుడో అప్పుడు ఆత్మహత్య చేసుకోవాల్సింది.

– ఉప్పలంచి నరేందర్, సీనియర్‌‌ జర్నలిస్ట్

https://chourasta.com/

మరిన్ని కథనాల కోసం..

వ్యవసాయమే నా లక్ష్యం..

అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్‌ జర్నలిస్ట్)

పొమ్మనలేక పొగ పెడుతున్నరు..

ఆటోనడిపిన పాలమూరు డెస్క్ జర్నలిస్ట్‌

ఉద్యోగం మానేకే అప్పు ముట్ట జెప్పిన

 

You may also like...