KCR is my god : కేసీఆరే నా దేవుడు

KCR is my god : కేసీఆరే నా దేవుడు
  • దళిత బంధు కోసం ఒక్క పైసా తీసుకోలె
  • కావాలనే నాపై ఆరోపణలు చేస్తున్నరు
  • మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్‌ ఆశిస్తున్నా..
  • మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

జనగామ, (చౌరాస్తా ప్రతినిధి) : బీఆర్‌‌ఎస్‌ పార్టీ ఓ దేవాలయం లాంటిదని, కేసీఆర్ నాకు దేవుడని జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పేర్కొన్నారు. దళిత బంధు పేరిట తాను డబ్బులు వసూలు చేసినట్టు వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు జనగామ ఆయన విలేకరులతో మాట్లాడారు. 2003లో కేసీఆర్‌‌ పిలుపుతో పార్టీలోకి వచ్చిన తాను.. తొలి నాళ్లలో పార్టీ కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ఆస్తులు అమ్ముకుని ఎంతో ఖర్చు చేశానని చెప్పారు. అలాంటి నాపై కొందరు కావాలనే కుట్రలు చేస్తున్నారని ముత్తిరెడ్డి వాపోయారు. టీఆర్‌‌ఎస్‌లో చేరిన తర్వాత 2004లో వర్ధన్నపేటలో పోటీ చేస్తే 59,500 ఓట్లు వచ్చినట్టు వివరించారు. తరువాత పాలకుర్తి నియోజకవర్గం ఇంచార్జిగా బాధ్యలు అప్పగించారని, ఆ సమయంలో టీఆర్ఎస్‌, టీడీపీ పొత్తులో భాగంగా తనను పోటీచేయమన్నా.. వద్దని టీడీపీ కోసం త్యాగం చేశానని తెలిపారు. ఆ తరువాత ఉప్పల్ నుంచి పోటీ చేసి ఓడిపోయానన్నారు. ఆ టైంలో జనగామలో టీఆర్‌‌ఎస్‌ మొత్తం భూస్థాపితమైందన్నారు. ఆ సమయంలో టీఆర్‌‌ఎస్‌ అధినేత కేసీఆర్‌‌ తనను ఇక్కడకు పంపారని తెలిపారు. నా నుంచి నేటి వరకు తాను పార్టీలో ఉంటూ పనిచేస్తూ వస్తున్నానని పేర్కొన్నారు.

 KCR is my god : కేసీఆరే నా దేవుడు
కరువు నేలకు నీళ్లు తెచ్చిన
తాను 2014లో తాను ఎమ్మెల్యే గెలిచే నాటికి జనగామ నియోజకవర్గం తాగు, సాగునీటి లేక రాజస్థాన్‌ తలపించేదని ముత్తిరెడ్డి పేర్కొన్నారు. అలాంటి కరువు నేలను నేడు సస్యశ్యాలం చేశారనని చెప్పారు. తాను పని చేసిన సమయంలో ఎవరైనా ప్రజా ప్రతినిధులను, అధికారులను ఇబ్బంది పెడితే క్షమించాలి ఆయన కోరారు.



‘పల్లా’ పార్టీని కాపాడాలి
ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన కుటుంబం సమస్యను సాకు చూపి తనకు జనగామ ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వలేదని ముత్తిరెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్‌‌ స్వయంగా పిలిచి మాట్లాడిన తర్వాత ఆర్టీసీ చైర్మగా అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకు తమ్ముడు పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి గెలుపు కోసం పనిచేశామని చెప్పారు. ప్రస్తుతం ఎంపీ ఎన్నికల నేపథ్యంలో తాను మల్కాజ్‌గిరి టికెట్‌ ఆశిస్తున్నట్టు ముత్తిరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో తనను రాజకీయంగా దెబ్బతీసేందకు బద్దిడిగా కృష్ణారెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని పేర్కొన్నారు. నియోజకవర్గంలో దళిత బంధులో ఒక్క రూపాయి కూడా ప్రాడ్ జరగలేదన్నారు. కేవలం మద్దూరులో మాత్రమే జరిగితే మండల అధ్యక్షుడు మంద యాదగిరిని అడుగగా తన పేరు చెప్పి బద్దీపడిగా కృష్ణారెడ్డి వసూలు చేస్తున్నాడని చెప్పడని పేర్కొన్నారు. అనాగే తాను జనగామ, చేర్యాలలో ప్రెస్ మీట్ పెట్టి ఎలాంటి స్కామ్ జరగకూడదని చెప్పానని గుర్తుచేశారు. అలాంటి తాను రూ.62 లక్షలు వసూలు చేశానని చెప్పడం సరికాదన్నారు. పార్టీ కోసం ఎంతో ఖర్చు పెట్టిన తనపై పార్టీలో వ్యక్తులే ఇలాంటి అసత్యపు ప్రచారాలు చేయడం సరికాదన్నారు. స్థానిక ఎమ్మెల్యే, తమ్ముడు పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి ఈ సమస్యను పరిష్కరించి పార్టీని కాపాడాలని ముత్తిరెడ్డి కోరారు. జనగామ మార్కెట్‌మాజీ చైర్మన్ బాల్దె సిద్దిలింగం, చేర్యాల మున్సిపల్ వైస్- చైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి, బీఆర్‌‌ఎస్‌ లీడర్లు మిద్దెపాక లెనిన్, కుమార్, దళిత బందు లబ్ధిదారులు పాల్గొన్నారు.



 

వ్యవసాయమే నా లక్ష్యం..

అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్‌ జర్నలిస్ట్)

పొమ్మనలేక పొగ పెడుతున్నరు..

ఆటోనడిపిన పాలమూరు డెస్క్ జర్నలిస్ట్‌

ఉద్యోగం మానేకే అప్పు ముట్ట జెప్పిన

You may also like...