క్రైస్తవం ఓ జీవన విధానం – ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్ పూర్, చౌరాస్తా : క్రైస్తవం ఓ జీవన విధానం అని ప్రేమ, జాలి, దయ, కరుణతో సాటివారి ఆదరించాలని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలోని నిర్మల మాత చర్చి, ధర్మసాగర్ మండలం కరుణాపురం చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన సతీమణి వినయ రాణి తో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రైస్తవులు ఆరాధించే ఏసు ప్రభు మార్గమున పయనించి ప్రతి ఒక్కరు శాంతి, సౌక్యాలతో జీవించాలన్నారు.
అతి పురాతన నిర్మల మాత చర్చిని సుందరీకరించి నియోజకవర్గంలో అందమైన చర్చిగా తీర్చిదిద్దేందుకు తన వంతు తోడ్పాటున అందిస్తానన్నారు. మాజీ ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ గొప్ప చరిత్ర ఉన్న ఈ చర్చి అభివృద్ధితో పాటు వంద పడకల ఆసుపత్రి నిర్మాణం, మున్సిపాలిటీ మొదలైన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం కడియం శ్రీహరి, డాక్టర్ రాజయ్య లు క్రిస్మస్ కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఫాదర్ అగస్టియన్ ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకలు స్థానిక సర్పంచ్ టి సురేష్ కుమార్, ఫాదర్ విజయపాల్ రెడ్డి, సులోచన, అనిత, చంద్రమౌళి, రాజు, శీను, నాగయ్య, మధు, రాజ్ కుమార్, ప్రమీల, ఎలీషా నాయకులు చింతకుంట్ల నరేందర్ రెడ్డి, బూర్ల శంకర్, సున్నం యాదగిరి తదితరులు పాల్గొన్నారు.