journalist : జర్నలిజం మసకబారుతోంది

journalist : జర్నలిజం మసకబారుతోంది

జర్నలిజం మసకబారుతోంది

ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిజం రూపుమారుతూ డిజిటల్ మీడియాగా ప్రజాక్షేత్రంలో దూసుకు పోతోంది. రానున్న రోజుల్లో డిజిటల్ మీడియాదే..! అగ్రభాగం అయ్యే అవ కాశం మెండుగా కనిపిస్తోంది. ప్రింట్ అండ్‌ ఎలక్ట్రానిక్ మీడియా రూపంలో ఏ ఫ్లాట్ ఫామ్ నుంచి ఏ రూపంలో మీడియా పురుడు పోసుకున్నా.. అది మీడియాగానే పిలువబడుతుంది. ఆ మీడియా విలువలతో పనిచేస్తే ఆహ్వానించదిగిన విషయమే.. అయితే మీడియా డిజిటల్ రూపుగా మారుతున్న క్రమంలో ‘పెరుగుట విరుగుట కొరకే’ అన్నట్లు మీడియా తయారైంది. ప్రతి వాడి చూపు మీడియా మీదే..! ఇప్పుడు ప్రతి వాడు మీడియానే..!

అక్షర జ్ఞానం లేకున్నా..


ఇక్కడ ఒక చిన్న విషయం రెగ్యులర్ మీడియా ఫ్లాట్ ఫామ్ పై జర్నలిజంలో విసిగి వేసారి పోయిన ఎంతోమంది సీనియర్ జర్నలిస్ట్ లు సొంత మీడియాని ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తున్నారు. అలాగే అక్షర జ్ఞానం లేనివారు, కొంత మంది అవినీతి, అక్రమార్కులు కూడా ఈ డిజిటల్ మీడియా పేరిట సొంతగా ఛానల్స్, పేపర్స్, న్యూస్ వెబ్‌ సైట్లు పలు రకాలుగా డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి తమ -అక్రమ వ్యవహారాలకు వారు స్వతహాగా తయారు చేసుకున్న ఐడీ కార్డులు అడ్డంపెట్టి జర్నలిజంలో అక్రమంగా చొరబడుతున్నారు. ఇక జర్నలిజంలో దశాబ్దాల అనుభవం ఉన్న వారు, జర్నలిజంలో ప్రత్యేక గుర్తింపు సాధించి ఎంతో మంది సీనియర్లు నేడు జర్నలిజానికి ఏమీ కాలేక పోయామే అనే మనో వేదనలో ఉన్నారు.

గుంపులు.. గ్రూపులు..



 

‘హే అన్నా.. ఎన్నికల సీజన్‌ జర్నలిస్టులకు పండుగే పో..’ ఓ మిత్రుడు అన్న మాట ఇది.. ఈ ఒక్క మాట చాలు జర్నలిస్ట్‌ అంటే సమాజానికి ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుకుసుకునేందుకు.. గతంలో విలేకరి అంటే ఓ విలువ ఉండేది. ప్రస్తుతం పుట్టగొడుగుళ్ల పుట్టుకొచ్చిన మీడియా సంస్థలతో సమాజానికి ఎంత వరకు మేలు జరుతుంది దేవుడెరుగు.. కానీ, జర్నలిస్టులకు మాత్రం విలువ లేకుండా పోయిందనే చెప్పాలి. ఇక కొన్ని ప్రాంతాల్లో జర్నలిస్టులుగా చెలామణి అవుతున్న వారు చిన్నా.. పెద్ద మీడియా అనే తేడాలను చూపుతూ గ్రూపులుగా మారి వారు చేస్తున్నది అంతా ఇంతా కాదు. ఈ గ్రూపులు వారు ఎవరినైనా టార్గెట్‌ చేస్తే వారు అనుకున్నది సాధించేందుకు ఎంతవరకైనా వెళ్తున్నారు. టార్గెట్‌ చేసిన వ్యక్తులపై వ్యతిరేక కథనాలు సృష్టించడం.. లేదా వారిని పూర్తిగా బహిష్కరించడం చేస్తున్నారు. ఇలాంటి వారి వల్ల మొత్తం జర్నలిస్టు సమాజానికి చెడ్డపేరు వస్తోంది.

సమాధి అవుతున్నవిలువలు..


మీడియా రంగంలో పలు రకాల ఫ్లాట్ ఫామ్స్ ద్వారా కొత్త కొత్త పేపర్లు, సరి కొత్త న్యూస్ ఛానల్స్ డిజిటల్ మీడియా వంటివి రావడం తప్పుకాదు. కనీసం ‘జర్నలిస్ట్’ అంటే ఏమిటో.. అర్థం తెలియని వారు స్టేట్ బ్యూరోలట..!  సీఈఓ, స్టాఫ్ రిపోర్టర్స్ అంట..! రీజనల్ కో-ఆర్డినేటర్స్ అంట..! ఇప్పుడు మీడియా అంటే వీరే..! వీరి వల్ల జర్నలిజం మసకబారుతోంది. విలువలు కలిగిన జర్నలిజం ప్రస్తుతం ఈ సమాజంలో పెద్దగా లేదు. ఇక్కడ జర్నలిజం తప్పు అని చెప్పడం లేదు. కానీ ఈ రోజు జర్నలిజంలో విలువలు సమాధి కాబడ్డాయి. విలువలు కలిగిన జర్నలిస్ట్ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. జర్నలిజం అమ్మకం, కొనుగోలు విధానంలో బజారు సరుకుగా మార్చేశాయి కొన్ని అవినీతి శక్తులు. ఈ మధ్య ఏ ప్రాంతంలో చూసినా ఆ.. పత్రిక, ఈ.. చానల్, స్టేట్, జిల్లా, రీజనల్ కో-ఆర్డినేటర్స్ అంటూ ఏ విధమైన అర్హతలు లేని ప్రతి వాడు జర్నలిజంలో రాష్ట్ర, జిల్లా స్థాయి హోదాలు చెప్పుకుంటూ ప్రభుత్వ సంస్థలు ముందు మనుగడ కొనసాగిస్తున్నారు. అధికారులకు ఐడీ కార్డ్స్, లోగోలు చూపి.. హోదాలు చెప్పి మీడియా ముసుగులో అక్రమ వ్యహారాలు కొనసాగిస్తున్నారు. సెటిల్‌ మెంట్లు, రియల్‌ ఎస్టేట్‌ దందాలు చేస్తున్నారు. జర్నలిజంలోకి వచ్చే ఇలాంటి స్క్రాప్ ఏరి వేయకుంటే ఇప్పటికే ప్రమాదపు అంచుల్లో ఉన్న జర్నలిజం నడివీధిలో నగ్నంగా నిలుచుని సిగ్గుతో తలదించుకోవడం తప్ప చేసేది ఏమీ ఉండదు.

 

మరిన్ని కథనాల కోసం..

వ్యవసాయమే నా లక్ష్యం..

అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్‌ జర్నలిస్ట్)

పొమ్మనలేక పొగ పెడుతున్నరు..

ఆటోనడిపిన పాలమూరు డెస్క్ జర్నలిస్ట్‌

ఉద్యోగం మానేకే అప్పు ముట్ట జెప్పిన

You may also like...