jangaon mla muttireddy : అంతటా.. ముత్తన్న.. సీనన్న ముచ్చటే!
ఓ మల్లన్న.. బాగున్నవే..? ఏంది గీ మధ్య కనిపిస్తాలేవ్..? మొత్తం నల్లపూసైనవ్.. ఏందీ నువ్వు కూడా ఏమైనా సమ్మర్ టూర్లు పోయినా ఏందీ..!
మల్లన్న : హే.. పో.. ఎల్లన్న టూర్ లేదు.. గీర్ లేదు. నేనేమైనా రాజకీయాలు చేస్తన.. రాజీలు చేస్తన..! ఎండలు బాగున్నయ్ కదా.. అట్లని బయటకు రాలే..! అందుకే కనిపిస్తలేను. జర సల్లబడ్డది అని గిట్ల వచ్చిన.
ఎల్లన్న : ఔ.. మల్లన్న.. మన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదన్న.. ఏందే జోరుమీదున్నడు..! పాత యాదన్నకు ఇప్పటి యాదన్నకు పోలికే లేకుండా మారినట్టు కనిపిస్తున్నడు. గప్పుడు ముత్తన్న అంటే ఉన్నడా లేడా అన్నట్టుగా తన పనేదో తను చేసుకుని పోతుండే. ఇప్పడు మన ఎమ్మెల్యే సారు మాటల ముత్తన్నగా మారిపోయాడు. అసలు ఆయన్ను చూస్తే.. ఈనే మన సారేనా.. అనిపిస్తుంది.
మల్లన్న : అంతే ఎల్లన్న.. మన ఎమ్మెల్యే (muttireddy) సారు ఏది చేసినా ఓ జోష్ ఉంటది.. ఓ రిథమ్ ఉంటది.. ఓ స్టైల్ ఉంటది. అది సరేగాని యాదన్న ఇంతకు ఇంత గొప్ప మార్పు సడెన్ గా ఎందుకొచ్చినట్టే. యాదృచ్ఛికమా..? కావాలని మారిండా..?
ఎల్లన్న : అవునే మల్లన్న.. గప్పట్ల మహిళా దినోత్సవం నాడు ఆడోళ్ల మీటింగ్ ల కవితక్క కోసం ఉన్నట్టుండి తెగ ఊగిపోయిండు. నేను టీవీలో చూసిన. ఎదురుంగ ఆడోళ్ల గుంపు ఉన్నదనా..? లేకపోతే అదేదో సందర్భం కలిసొచ్చిందనా..? సరే ఏదైతేంది గానీ మహిళా దినోత్సవం నాడు ముత్తిరెడ్డి సారు ఆడోల్ల మీద పలికిన పలుకులన్నీ ముత్యాలే.. పో..! సారు ఊగుడు పాడుగాను.. ఊగి ఊగి మైకు పట్టుకుని ఏడ పడ్తవో అనుకుని గాబరాపడ్డా.. ఎందుకంటే సారు కిందపడ్తే మళ్ల మనసొంటోళ్లకే కట్టం గదే. సారు సల్లగుంటేనే మనబోటోళ్లు మంచిగుంటరు.
మల్లన్న : సరే ఎల్లన్న.. అప్పటి సొల్లుంతా ఏందిగానీ.. అసలు గిప్పటి ముచ్చట ఏందే చెప్పు. సారు ఈ మధ్య మస్తు గరం మీద ఉంటుండు. ఏ మీటింగ్ చూసినా సారు మాటల తూటాలు వదులుతుండు. గామొన్న తరిగొప్పుల మీటింగ్‌ల కొండెంగలు, చీడపురుగులు అంటూ సొంత పార్టీ వొళ్లనే తిట్టిండు. కాళ్లుచేతులు ఇరుస్తా అన్నడు. ఇక జనగామలో అయితే పాపం సారు.. ఆయన కట్టే ఇడనే కాలుతది.. ఆ బూడిది జనగామ చెరువుల కపాలని అన్నాడు. అసలు సారు గంత పెద్ద మాట ఎందుకన్నడే..!
ఎల్లన్న : అదేంలేదు మల్లన్న.. అసలే ఎన్నికలు దగ్గర కొస్తుండవట్టే..! సారును ఎదురించే అపొజిషన్ లీడర్ల పెద్దగ లేకున్నా.. సొంత పార్టీ వాళ్లే సారు సీటుకు ఎసరు పెట్టవట్టరి. అందుకే సారు మనసులో మనసు ఉంటలేదు.
మల్లన్న : అంతేనా ఎల్లన్న..! అసలు గీ పొచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఎవరే..! (srinivasreddy) జనగాంల.. ఈయన పేరు బాగ ఇనొస్తుంది. ఈయన మనోడేనా.. అంటే మన జిల్లానేనా..! ఏ పార్టీ నుంచి వచ్చిండు..?
ఎల్లన్న : ఓర్నీ మల్లన్న.. పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తెల్వదానే. బీఆర్‌ఎస్ లీడరే.. మన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ. వరంగల్ జిల్లా నడికుడ మండలం వరికోల్ ఆయన సొంతూరు.. మన పాత జిల్లా వోడు అన్నట్టు. కేసీఆర్ కొడుకు మంత్రి కేటీఆర్‌కు మంచి దోస్తు. ఆయనతోనే రాజకీయాల్లోకి వచ్చిండు. ఇక పోచంపల్లికి మన ముత్తన్న (muttireddy) కూడా ఎంతో సహకారం ఇచ్చిండు. ఇది స్వయంగా ఆయన చెప్పిండు కూడా.
మల్లన్న : మరి గట్లయితే ముత్తిరెడ్డికి పోటికి కొస్తడానే..!
ఎల్లన్న : మరే కదా.. అసలు కథ..! అసలే ఎలచ్చన్ల టైం. జనగామలో పార్టీ తీరు చూస్తేనేమో జర ఎటమటం అయ్యేట్టుందని ఆడోడు.. ఈడోడు పేలవట్టే. ఎవడు పేళ్తే ఏంది గానీ.. ఇంతకాలం ముత్తిరెడ్డికి నేను పోటీ రాను అని చెప్పిన సొంత పార్టీ లీడర్ పోచంపల్లి ఇంటెనుక రాజకీయాలు మొదలు పెట్టిండు. నియోజకవర్గం నుంచి రోజు ఎవడో ఒకడు ఆయన దగ్గరకు పోవట్టిరి.. కలువట్టిరి..! ఆ ఫొటోలు ఏదో గ్రూపుల్లో పెట్టవట్టిరి. అవి చూసి మిగతా లీడర్లు కిందమీద కావట్టరి. గీ బాధతోనే ముత్తిరెడ్డి సారు గరం మీద ఉంటుండు.
మల్లన్న : అయ్యో అట్టనానే..! అట్లయితే ముత్తిరెడ్డి సారుకు పెద్ద కట్టమే వచ్చిందిపో.. అందుకే గరంగరంగా మాట్లాడుతుండు కావొచ్చు..! అయినా ఎవలు వచ్చినా ముత్తిరెడ్డి సారుకు సీఎం కేసీఆర్ వద్ద మంచి పేరుందంట కదా..! ఈసారి టికెట్ ఆయనకే అని పెద్దసారు చెప్పిండట కదా..!
ఎల్లన్న : అవునే మల్లన్న.. ఈ విషయం కూడా మన ఎమ్మెల్యే (muttireddy) సారు గట్టిగనే ప్రచారం చేసుకుంటుండు. తనకు అడ్డుస్తున్న వారిపై పరోక్షంగా విమర్శలు చేస్తుండు. ఇక చివరాఖరికీ చూడాలె మరి.. పెద్దసారు టికెట్ ఎవరికి ఇస్తడో..! ఎవరిని బుజ్జగిస్తడో..! ఇది గిట్ల ఉంటే ఎమ్మెల్యే సారు బిడ్డ తుల్జాభవానీ రెడ్డి ఇంకో తలనొప్పి అయ్యిందే..
మల్లన్న : హే.. బిడ్డ సల్లగుండా గా ముచ్చట రోజు ఇంటనే ఉన్నా.. ఆమె ముచ్చట మల్ల మాట్లాడుకుందాం.. పోవే ఎల్లన్న.. నాకు కడుపులో గోకుతుంది నేను ఇంటికి పోయి సల్లపడుతా..!
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)
ఆటోనడిపిన పాలమూరు డెస్క్ జర్నలిస్ట్
ఉద్యోగం మానేకే అప్పు ముట్ట జెప్పిన