indian idol shanmukhapriya : దుమ్మురేపుతున్న షణ్ముఖ ప్రియ

indian idol shanmukhapriya : దుమ్మురేపుతున్న షణ్ముఖ ప్రియ

indian idol shanmukhapriya : దుమ్మురేపుతున్న షణ్ముఖ ప్రియ

2020 ఇండియన్‌ ఐడల్‌ సిరీస్‌ 12 తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియ దుమ్మురేపుతోంది. బుల్లితెర స్టార్‌‌ సింగర్ అయిన షణ్ము తన నాలుగో ఏట నుంచే పాడడం ప్రారంభించింది. ఇప్పటి వరకు ఎన్నో స్టేట్‌, నేషనల్‌ లెవల్ పాటల పోట్లో పాల్గొని సత్తా చాటింది. తాజాగా ఇండియన్‌ ఐడిల్‌ సిరీస్‌ 12లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది.

తల్లిదండ్రులే గురువులు..

సింగర్‌‌ షణ్ముఖ ప్రియ తల్లిదండ్రులు రత్నమాల, శ్రీనివాస్ ఇద్దరు కూడా శాస్త్రీయ సంగీతంలో ఎం.ఏ పట్టాలు పొందిన వారే. వారి వారసత్వంగా షణ్ముఖ కూడా పాటల బాట పట్టింది. తల్లిందడ్రులే గురువులు కావడం కూడా ఆమెకు కలిసిసొచ్చింది. పాటలే కాదు షణ్ముఖ చదువులోనూ 98 పర్సంటేజీతో మంచి ర్యాంకుతో దూసుకెళ్తోంది.

భాషేదైనా సరే..

తెలుగు అమ్మాయి అయిన షణ్ముఖ ఏ భాషలో నైనా అలవోకగా పాటలు పాడుతుంది. 2010లో తమిళ చానల్‌ స్టార్‌‌ విజయ్‌లో తమిళ్‌ జూనియర్‌‌ సూపర్‌‌ స్టార్‌‌లో పాల్గొని విజేతగా నిలిచింది. 2018లో  ‘జీ’ టీవీ వారు నిర్వహించిన సరిగమ లిటిల్‌ చాంఫియన్‌లో షణ్ముఖ ప్రియ విన్నర్‌‌గా నిలిచింది. ‘మా’ టీవీ సూపర్‌‌ సింగర్ 4లో షణ్ముఖ ఫైనల్‌ వరకు వెళ్లింది. తాజాగా ఆమె ఇండియన్‌ ఐడల్‌ సిరీస్ 12లో తన సత్తా చాటుతోంది.

అందరి దృష్టి ఆమెపైనే…

షణ్ముఖ ప్రియ ఇండియన్‌ ఐడల్ ఆడిషన్స్‌ నుంచే అందరి దృష్టిని ఆకర్శించింది. ఆమె పాటలతో జడ్జిలను మంత్రముగ్దుల్ని చేస్తోంది. షణ్ముఖ పాట కోసం ఎంతో మంది ప్రేక్షకులు ఎదురుచూస్తారు అనడంలో అతిశయోక్తి లేదు. ఆదివారం ప్రసారమైన ఎపిసోడ్‌కు గెస్ట్‌గా వచ్చిన సింగర్స్‌ బాద్‌ షా ఆమె పాట విని ప్రశంసలతో ముచ్చేత్తారు. మరో లేడీ గెస్ట్‌ ప్రియను ‘చింపేశావ్‌..’ అంటూ మెచ్చుకుంది. సింగర్‌‌గా తన కేరియర్‌‌ బిల్డ్‌ చేసుకునే వారికి ఇండియన్‌ ఐడల్‌ ఎంతో ముఖ్యమైంది. ఈ క్రమంలో షణ్ముఖ ప్రియ (indian idol shanmukhapriya) కూడా ఐడల్‌ సాధించేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది.

మరిన్ని కథనాల కోసం..

అక్షర యోధుల యాత్ర షురూ..

అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్‌ జర్నలిస్ట్)

ఉత్తర తెలంగాణ ఎవరిది.. (పోలీసులదా.. మావోలదా..)

పొమ్మనలేక పొగ పెడుతున్నరు..

ఆటోనడిపిన పాలమూరు డెస్క్ జర్నలిస్ట్‌

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *