high court : మైనర్ వివాహంపై హైకోర్టు సంచలన తీర్పు
high court : మైనర్ వివాహంపై హైకోర్టు సంచలన తీర్పు
- రజస్వరాలైన బాలికలు పెళ్లి చేసుకోవచ్చు
కోర్టులు ఇస్తున్న కొన్ని తీర్పులు ఇటీవల వివాదస్పదంగా మారుతున్నాయి. చట్టాలను అనుసరించి తీర్పులు ఉంటున్నా.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అవి విరుద్ధంగా ఉంటున్నాయి. తాజాగా ఇస్లామిక్ చట్టాన్ని అనుసరించి పంజాబ్ హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. పంజాబ్‌కు చెందిన 17 బాలిక, తనకన్న 20 ఏండ్లు పెద్దవాడైన ( 37 సంవత్సరాలు) వ్యక్తిని జనవరి 21న వివాహం చేసుకుంది. వారి వివాహం ఇష్టం లేని బాలిక కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారు. దీనిపై ఆ జంట కోర్టును ఆశ్రయించింది. మ్యారేజ్ చేసుకున్న తమను కుటుంబసభ్యులు బెదిరిస్తున్నారని, వారి నుంచి రక్షణ కల్పించాలని అభ్యర్థించారు. ఈ కేసుపై విచారణ చేసిన కోర్టు కీలక తీర్పును వెలువరించింది.
ఇస్లామిక్ చట్టం ప్రకారం యుక్త వయసు మైనర్ ముస్లిం బాలిక తన ఇష్టం మేరకు పెళ్లి చేసుకునే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. ఇస్లామిక్ చట్టంలోని ఆర్టికల్ 195ని ఈ సందర్భంగా కోర్టు ప్రస్తావించింది. యుక్త వయస్కులైన మైనర్లు వారి గార్డియన్ల ద్వారా వివాహ బంధంలోకి అడుగుపెట్టవచ్చు. మైనర్లకు నచ్చితే.. తమకు ఇష్టం మేరకు గార్డియన్ అనుమతి ఉన్నా లేకపోయినా పెళ్లి చేసుకోవచ్చని ఆ ఆర్టికల్‌లో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా కోర్టు గుర్తు చేసింది. అమ్మాయి మైనర్ అయినా కూడా ఇస్లామిక్ చట్టం ప్రకారం ఈ పెళ్లి చెల్లుతుందని తీర్పు చెప్పింది కోర్టు. వారి పెళ్లిని ధృవీకరించిన హైకోర్టు.. (high court) వారికి రక్షణ కల్పించాలని మొహాలీ ఎస్ఎస్‌పీని ఆదేశించింది.
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)