eenadu : ఈ–నాడు

eenadu : ఈ–నాడు

ఇక డిజిటల్‌ ‘ఈ–నాడు’

కరోనా అన్ని రంగాలతో పాటు పత్రికా రంగాన్ని కూడా అతలాకుతలం చేసేసింది. వైరస్‌ దెబ్బకు చిన్నాచితకా పేపర్లు మూతపడగా.. పెద్దపెద్ద సంస్థలు ఖర్చులను తగ్గించుకుని నెట్టుకొస్తున్నాయి. తెలుగు పత్రికా రంగంలో కొన్నేళ్లుగా అగ్రస్థానంలో ఉన్న ‘ఈనాడు’ సంస్థ కూడా తన పంథాను మార్చుకుని ముందుకు సాగే పరిస్థితి తప్పలేదు. ఇక మీడియాలో వస్తున్న మార్పుల కారణంగా అధినేత రామోజీరావు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లా ట్యాబ్‌లెట్లు ఎత్తిసిన బ్రాడ్‌ షిట్లతో వస్తున్న ‘ఈనాడు’.. ఇలీవల చతుర, విపుల, తెలుగు వెలుగు, బాలభారతం వంటి మాస పత్రికలను శాశ్వతంగా మూసివేస్తూ ప్రకటన చేసింది. త్వరలో ‘ఈనాడు’ డేలీ ప్రింట్‌ను క్లోజ్ చేందుకు కసరత్తు చేస్తున్నారని ఆ సంస్థ ఉద్యోగులు బహిరంగంగా చెబుతున్నారు. ఇదే జరిగితే భవిష్యత్‌లో ‘ఈనాడు’ కేవలం ఆన్‌లైన్ ఎడిషన్‌కే పరిమితం అవుతుంది.

ఇప్పటికే గుంటూరు యూనిట్‌లో పత్రిక ప్రింట్‌ను ఔట్‌సోర్సింగ్‌కు అప్పగించారు. ఔట్ సోర్సింగ్ ద్వారా అయితే ఉద్యోగుల పీఎఫ్, గ్రాట్యూటీ, వేజ్ బోర్డు వేతన సిఫారసులు వంటి తలనొప్పులు ఉండవని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రింటింగ్ యూనిట్లను ఔట్ సోర్సింగ్‌కు అప్పగిస్తారని సమాచారం. అయితే దశల వారీగా ఈ ప్రక్రియను కొనసాగించి 2024 వరకు పూర్తిగా ప్రింటింగ్ క్లోజ్‌ చేస్తారని తెలిసింది.

మెడికల్‌ ఫీల్డ్‌ వైపు..

ఈనాడు అధినేత రామోజీరావు మెడికల్‌ వ్యాపార రంగంలోకి దిగుతున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఈనాడు’ దినపత్రిక జిల్లా ఆఫీస్‌లు ‘మెడికల్ డిస్ట్రిబ్యూటర్’ సంస్థలుగా మారబోతున్నట్టు సమాచారం. ఈ మేరకు భారత్ బయోటెక్ సంస్థతో ఒప్పందం కూడా జరిగిందని ప్రచారం సాగుతోంది.

సోషల్‌ ‘మీడియా’

ఇప్పటికే సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ధాటికి మెయిన్ స్ట్రీమ్ మీడియా విలవిలలాడుతోంది. ప్రస్తుతం సెల్‌ ఫోన్‌ ఉన్న ప్రతీ ఒక్కరు జర్నలిస్టులు అయిపోయారు. ఏ చిన్న ఇష్యూ అయినా సరే వీడియోలు, ఫొటోలను తీసి సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అవి క్షణాల్లో వైరల్‌గా మారుతున్నాయి. మరోవైపు వెబ్‌ మీడియా కూడా బాగా పెరిగిపోయింది. వీటి ద్వారా ఎలాంటి న్యూస్‌ అయినా క్షణాల్లో అందరికీ చేరిపోతోంది. వీటన్నింటి తట్టుకుని ప్రింట్‌ మీడియా మనుగడ సాధించడం కొంచెం కష్టతరంగానే మారిందని చెప్పవచ్చు. అప్పటికే అందరికీ తెలిసిన వార్తను కొత్త తరహాలో.. కొత్త కోణంలో చెప్పడం కత్తిమీద సామే అవుతోంది. ఇదంతా ఒక ఎత్తయితే పేపర్‌ సర్క్యూలేషన్‌ మరో ఎత్తు.. పెరిగిన ముడిసరుకులకు అనుగుణంగా ఏటేటా పేపర్‌ రేటు పెంచుకుంటూ మార్కెట్‌లో అమ్ముకోడం ఇబ్బందిగానే మారింది. అందుకే ఈనాడు డిజిటల్‌ రంగం వైపు అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఏడాది కింద (కరోనా కంటే ముందే) నుంచే మార్పులకు శ్రీకారం చుట్టుంది. ఇంతలో కరోనా రావడం మంచి ప్లస్‌ అయ్యింది. వైరస్‌ సాకుతో సంస్థలోని పెద్ద జీతాగాళ్లకు ఉద్వాసన పలికింది. తాజాగా ఈ మార్చి 31 వరకు మరికొంత మందిని వీఆర్‌‌ఎస్‌ పేరుతో  సాగనంపేందుకు రెడీ అవుతోంది. తర్వాత విడతల వారీగా మార్పులు చేసుకుని.. ‘లార్జెస్ట్‌ స్క్యూలేటెడ్‌ తెలుగు డేలీ’ నుంచి ‘లార్జెస్ట్‌ వ్యూవర్స్‌ తెలుగు డేలీ’గా మారేందుకు అడుగులు వేస్తోంది.

మరిన్ని కథనాల కోసం..

అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్‌ జర్నలిస్ట్)

ఉత్తర తెలంగాణ ఎవరిది.. (పోలీసులదా.. మావోలదా..)

పొమ్మనలేక పొగ పెడుతున్నరు..

ఆటోనడిపిన పాలమూరు డెస్క్ జర్నలిస్ట్‌

ఇవీ చదవండి..

మైనర్‌‌ వివాహంపై హైకోర్టు సంచలన తీర్పు

ఫాదర్‌‌ అయ్యాక.. బూతులు తగ్గించా.. బన్నీ

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *