దేవుడి సేవలో తరించాడు
- అందరి మదిలో నిలిచాడు
- భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకుడు శేషు
- వేడుకగా అర్చకుడి విగ్రహ ప్రతిష్టాపన
స్టేషన్‌ఘన్‌పూర్, చౌరాస్తా :సౌమిత్రి శ్రీరంగాచార్యులు అర్ధ శతాబ్దం పాటు దేవుడు సేవ చేశాడు.. అందరి మదిలో నిలిచాడు.. అని భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు అన్నారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తాటికొండ శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో అర్చకుడిగా సేవ చేసిన సౌమిత్రి రంగాచార్యులు గత ఏడాది జనవరి 23న మరణించారు. గ్రామస్తులు, అభిమానుల కోరిక మేరకు ఆయన కుమారులు సౌమిత్రి లక్ష్మణాచార్యులు, సౌమిత్రి రామాచార్యులు, కూతురు వకుల మాల తండ్రికి గుడి కట్టించారు.
గురువారం వరంగల్ భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకులు శేషు, మండల వైస్ ఎంపీపీ చల్ల సుధీర్ రెడ్డి, సర్పంచ్ చల్ల ఉమాదేవి, రాపోలు మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం శ్రీరంగాచారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం వక్తలు అర్చకుడు చేసిన సేవలను స్మరించుకున్నారు. సౌమిత్రి రంగాచార్యులు అర్చకుడిగా పురోహితులుగా వైద్యుడిగా ఎలాంటి తారతమ్యం లేకుండా ప్రజల మనసులో సుస్థిర స్థానం సంపాదించారని గుర్తు చేసుకున్నారు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో యాజ్ఞక పీఠం కిషోర స్వామి, శిష్య బృందం, తెన్ను రాఘవాచార్యులు, వరుణచార్యులు, ఉప సర్పంచ్ మారపాక రాములు, మాజీ సర్పంచ్ సానాది రాజు, ఐలోని సుధాకర్, ఈగ గట్టుమల్లు, ఉబ్బని మల్లేశం, అక్కనపల్లి అంజయ్య, కుంభోజి రాములు, పోకల నారాయణ, పొన్నం రఘు, బొంకూర్ యాదగిరి, కిరణ్ గ్రామస్తులు పాల్గొన్నారు.