Bigg boss toper : బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరు టాపర్? ఎవరు వరస్ట్?

Bigg boss toper : బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరు టాపర్? ఎవరు వరస్ట్?

Bigg boss toper : బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరు టాపర్? ఎవరు వరస్ట్?

బిగ్‌బాస్ హౌస్‌లో తొలి వారాంతంలో కీలక ఘట్టానికి తెరలేచింది. శుక్రవారం నాడు లగ్జరీ బడ్జెట్ టాస్కుతో పాటు ఎవరు టాపర్, ఎవరు వరస్ట్ చెప్పాలంటూ ఒక్కో కంటెస్టెంట్‌ను బిగ్‌బాస్ ఆదేశించాడు. దీంతో అందరూ వరుసబెట్టి తమకు నచ్చిన వాళ్లను, నచ్చనివాళ్ల పేర్లను బిగ్‌బాస్‌కు తెలిపారు. ఈ క్రమంలో కొంతమంది ఎమోషనల్ అయ్యారు. కొంతమంది సీరియస్ వార్నింగులు ఇచ్చారు. మొదటగా యాంకర్ రవి తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. అందరినీ ఎంటర్‌టైన్‌ చేస్తున్న లోబో తనకు బెస్ట్‌ పెర్ఫార్మర్ అని, కంటెస్టెంట్లతో గొడవలు పెట్టుకున్న జెస్సీ వరస్ట్‌ అని పేర్కొన్నాడు. అనంతరం లోబో తనకు యానీ మాస్టర్ బెస్ట్ అని, జెస్సీ వరస్ట్ అని తెలిపాడు. తర్వాత జెస్సీ వంతు వచ్చింది. అతడు సిరి బెస్ట్ అని, యాంకర్ రవి వరస్ట్ అని తెలిపాడు. యాంకర్ రవి టాస్కులను సీరియస్‌గా తీసుకోవడం లేదని అతడు ఆరోపించాడు. శ్వేత వర్మ.. విశ్వ బెస్ట్ అని‌, పెద్ద నోరేసుకుని మాట్లాడుతున్న ఉమాదేవి వరస్ట్‌ అని పేర్కొంది. అనంతరం ఉమాదేవి వంతు రాగా.. విశ్వ బెస్ట్ అని, కాజల్ వరస్ట్ అని తేల్చేసింది.

అయితే ప్రియాంక సింగ్ దగ్గరకు వచ్చేసరికి ఈ తంతు సీరియస్‌గా సాగింది. తనను ఎంతగానో నవ్విస్తున్న లోబోను బెస్ట్ అని చెప్పగా.. ఉమాదేవిని వరస్ట్ అని చెప్పింది. అంతేకాకుండా ఉమాదేవిని ఉద్దేశిస్తూ.. పెద్దావిడగా ప్రతి ఒక్క కంటెస్టెంట్‌కు మంచి, చెడ్డలు చెప్పాల్సిన ఉమాదేవి మనిషులను చులకనగా చూస్తూ, అమర్యాదగా మాట్లాడతారని ఆరోపించింది. ఆమె ప్రవర్తన రూడ్‌ అని చెప్పుకొచ్చింది. దీంతో ప్రియాంక సింగ్, ఉమాదేవి మధ్య చాలాసేపు వాదోపవాదాలు జరిగాయి. ప్రియాంక సింగ్ మాటలతో ఏకీభవించని ఉమా.. నీతో మాట్లాడటమే వేస్ట్‌ అంది. ఈ మాటతో ఆవేశపడ్డ ప్రియాంక.. మీలా మనుషులను చీప్‌గా తీసిపడేయలేను అని దీటుగా బదులిచ్చింది. అనంతరం ఒకరి మీదకు ఒకరు దూసుకెళ్లారు. ఒకానొక సందర్భంగా ప్రియాంకసింగ్ షటప్‌ అంటూ ఉమాదేవికి వేలు చూపించడంతో ఉమాదేవి కాళికావతారం ఎత్తింది. అయితే కొన్ని క్షణాల తర్వాత నోరుజారానని తెలుసుకున్న ప్రియాంక.. తాను కోపంలో షటప్‌ అనేశానంటూ ఉమాకు సారీ చెప్పి ఏడ్చేసింది.

మరిన్ని కథనాల కోసం..

అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్‌ జర్నలిస్ట్)

పొమ్మనలేక పొగ పెడుతున్నరు..

ఆటోనడిపిన పాలమూరు డెస్క్ జర్నలిస్ట్‌

 

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *