AP Police Duty Meet : గౌరవ వందనం
AP Police Duty Meet : గౌరవ వందనం
పోలీసు శాఖలో ఉన్నతాధికారికి సెల్యూట్ చేయడం మామూలే.. కానీ, ఆ ఉన్నతాధికారి తను అల్లారుముద్దుగా పెంచిన గారాలపట్టి అయితే.. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఓ సారి ఊహించండి.. అలాంటి ఆనందం, అదృష్టం కలిగింది ఓ పోలీస్ ఆఫీసర్‌కు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఏపీ పోలీసు శాఖ తిరుపతిలో 2021 ‘ఇగ్నైట్’ పేరుతో మొట్ట మొదటి సారిగా పోలీస్ డ్యూటీ మీట్ (AP Police Duty Meet ) నిర్వహిస్తోంది. ఈ ప్రోగ్రాంకు ఇటీవల గుంటూరు అర్బన్ సౌత్ జోన్ డీఎస్పీ బాధ్యతలు తీసుకున్న జెస్సీ ప్రశాంతి (2018 బ్యాచ్) ‘దిశ’ విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రశాంతి తండ్రి శ్యామ్‌సుందర్ కూడా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోనే తిరుపతి కళ్యాణి డ్యామ్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నారు. డ్యూటీలో భాగంగా తనపై ఆఫీసర్ హోదాలో తిరుపతి ‘ఇగ్నైట్’ ప్రోగ్రామ్‌కు వచ్చిన కూతురు ప్రశాంతిని చూసి సీఐ శ్యామ్‌సుందర్ (AP Police) సంబురపడిపోయారు. ఉన్నతాధికారులతో మాట్లాడుతున్న ఆమెను చూసి ఆనందంగా దగ్గరకు వెళ్లి ‘నమస్తే మేడం..’ అంటూ సెల్యూట్ చేశారు. ఆమె కూడా.. అంతే హుందాగా సెల్యూట్ చేసి ‘ఏంటి నాన్నా..’ అంటూ.. గట్టిగా నవ్వేశారు.. అవును మరి పిల్లలు ప్రయోజకులైనప్పుడు ఆ తల్లిదండ్రల ఆనందం మామూలుగా ఉండదు.. ఆ సంతోషంతోనే తన గారాలపట్టికి గౌరవ వందనం చేశాడు సీఐ శ్యామ్‌సుందర్..
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)
ఉత్తర తెలంగాణ ఎవరిది.. (పోలీసులదా.. మావోలదా..)
ఆటోనడిపిన పాలమూరు డెస్క్ జర్నలిస్ట్