Anil geela : అనిల్‌కు అరుదైన గౌరవం

Anil geela : అనిల్‌కు అరుదైన గౌరవం

Anil geela : అనిల్‌కు అరుదైన గౌరవం

  • కేరళ టూరిజం నుంచి ‘మై విలేజ్ షో ఫేమ్ అనిల్‌’కు ఆహ్వానం
  • దేశం మొత్తంలోని టాప్ 10 మంది వ్లాగర్స్ కు పిలుపు
  • అందులో అనిల్‌ జీలకు స్థానం

సిద్దిపేట జిల్లాలోని నంగునూర్ మండ‌లం ద‌ర్గప‌ల్లి కుర్రోడు ‘అనిల్‌ జీల’కు (anil-geela) అరుదైన గౌరవం దక్కింది.  సోష‌ల్‌ మీడియాలో మంచి యూట్యూబ‌ర్‌గా ఆయ‌న‌కు పేరుంది. ‘మై విలేజ్ షో టీం’ స‌భ్యుడైన‌ అనిల్ జీల‌కు కేరళ‌ టూరింగ్ డిపార్ట్‌మెంట్ నుంచి ఆహ్వానం లభించింది. ఆ రాష్ట్రంలో ఉన్న ప్రకృతి రమణీయతను, టూరింగ్ స్పాట్లను ప్రపంచానికి చూపించాలని కోరింది. మై విలేజ్ షోఅనే యూట్యూబ్ చానెల్ ద్వారా ఫేమస్ అయిన ‘అనిల్’కు గతంలో తీసిన విలేజ్ కీకీ ఛాలెంజ్ డ్యాన్స్ కూడా మంచి గుర్తింపు తెచ్చింది. అనంతరం పలు సినిమాల్లోనూ నటించి బిగ్ స్క్రీన్‌కు కూడా పరిచయం అయ్యాడు. ‘మై విలేజ్ షో’లో నటిస్తూనే ప్రైవేట్ ఫోక్ సాంగ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్‌ లో హీరోగా నటిస్తున్నాడు. వీటితో పాటు అనిల్‌ ‘జీల వ్లాగ్స్‌’ అనే యూట్యూబ్ చానెల్ ద్వారా తను పర్యటించే ప్రదేశాలు, వాటి విశేషాలు, తన అనుభవాలను అందులో పెడుతున్నాడు. అయితే అందరూ యూట్యూబర్స్ మాదిరిగా కాకుండా అనిల్‌కు ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది. అదే ఆయనను యూట్యూబ్‌ స్టార్‌‌ను చేసింది. ఆయన వ్లాగ్స్ చూసిన వారెవరైనా తామే ఆ ప్రాంతంలో ఉన్నట్టు అనుభూతి చెందేలా చేస్తాడు. అందుకే ఆయన యూట్యూబ్ ఛానెల్ చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ మందికి రీచ్ అయ్యింది. ఇదే విషయం కేరళ టూరింగ్ డిపార్ట్‌మెంట్ గుర్తించింది. కేరళ అంటేనే సహజ అందాలకు పుట్టినిళ్లు. ఈ క్రమంలో టూరిస్టులను తమ రాష్ట్రానికి రప్పించుకోవడానికి అక్కడి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలోని టాప్ 10 యూట్యూబర్స్‌ ను  గుర్తించి, తమ రాష్ట్రంలోని ప్రకృతి రమణీయతను మరింత ఎక్కువ మందికి చేరేలా కృషి చేయాలని వారిని కోరింది. ఆ టాప్ 10 యూట్యూబర్స్‌ లో  తెలంగాణ నుంచి అనిల్ జీల చానెల్ (Anilgeelavloges) ఉండడం విశేషం.

 

Anil geela : అనిల్‌కు అరుదైన గౌరవం

మరిన్ని కథనాల కోసం..

అమ్మ కోసం అన్ని వదిలేసి వచ్చా..

అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్‌ జర్నలిస్ట్)

ఆటోనడిపిన పాలమూరు డెస్క్ జర్నలిస్ట్‌

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *