AFSP Act : ఏఎఫ్​ఎస్‌పీఏ ఉంటే.. అంతా కంట్రోల్‌..!

AFSP Act : ఏఎఫ్​ఎస్‌పీఏతో ఉంటే.. అంతా కంట్రోల్‌..!
  • ఆ చట్టాన్ని ఎత్తేయడమే కొంపముంచిందా..!
  • మణిపూర్‌‌ ఘటనపై మాజీ సైనికుడి విశ్లేషణ

ఈ శాన్య రాష్ట్రం అయిన మణిపూర్‌‌లో జరుగుతున్న వరుస ఘటనలు దేశాన్ని షేక్ చేస్తున్నాయి. ఈ ఘటనలపై ప్రతీ ఒక్కరు సోషల్‌ మీడియాలో మండిపడుతున్నారు. ప్రభుత్వాలను దొమ్మెత్తిపోస్తున్నారు. మరోసారి ఇలాంటివి పుణరావృతం కావద్దని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే అసలు మణిపూర్‌‌ అల్లర్లపై రాజకీయాలు చేస్తున్న పార్టీలు, లీడర్లకు వాస్తవాలు ఎంతవరకు తెలుసు అనేది పక్కన పెడితే.. ఇలాంటి అల్లర్లను కంట్రోల్‌ చేసే ఏఎఫ్​ఎస్‌పీఏ (ఆర్మడ్‌ ఫోర్స్ స్పెషల్‌ పవర్స్‌ యాక్ట్‌) అనే చట్టాన్ని ప్రభుత్వాలు ఎందుకు ఎత్తివేశాయి. దీనిపై ఎవరూ ఎందుకు మాట్లాడడం లేదు.. అనే విషయంపై చెందిన ఓ మాజీ సైనికుడు విశ్లేషణ ఇది..

 

కల్లోలిత ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం 1958లో పార్లమెంట్ ఏఎఫ్​ఎస్‌పీఏ (ఆర్మడ్‌ ఫోర్స్ స్పెషల్‌ పవర్స్‌ యాక్ట్‌) అనే చట్టాన్ని ఆమోదించింది. దీని ద్వారా త్రివిధ దళాలకు ప్రత్యేక అధికారాలు ఇచ్చింది. ఈశాన్య భారతదేశంలో 1958 సెప్టెంబర్ 11న మొట్టమొదటిసారి నాగాహిల్స్ అస్సాంలో విధించారు. ఈ చట్ట పరిధి కాలక్రమేమేనా ఈశాన్య రాష్ట్రాలైన ‘సెవెన్ సిస్టర్స్’గా పిలువబడే అస్సాం, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, త్రిపుర, సిక్కింలలో విస్తరించింది.

1983లో పంజాబ్, చండీగఢ్‌లో అమలు చేసి 1997లో ఎత్తి వేయడం జరిగింది. 1990లో ఈ చట్టాన్ని జమ్ముకాశ్మీర్ రాష్ట్రానికి  ఈ చట్ట పరిధి విస్తరించింది. భారతదేశ భూభాగం, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈ చట్టం ఒక రక్షణ కవచంలా ఉండేది.

పాకిస్తాన్, చైనా లాంటి శత్రుదేశాలతో సరిహద్దు వివాదాలు, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల నుంచి వివిధ జాతులు, తెగలు కుకీలు, రోహింగ్యా వలసలు లాంటి సమస్యలు ఉన్న ఉత్తర, తూర్పు భారతదేశంలో పకడ్బందీగా ఈ చట్టం అమలు జరిగింది. అయితే ‘ఐరన్ లేడీ ఆఫ్ మణిపూర్’ పిలువబడే హ్యూమన్ రైట్స్ ఆక్టివిస్ట్ సభ్యురాలు ఇరోమ్ షర్మిల ఈ చట్టాన్ని ఆర్ముడ్ ఫోర్సెస్ దుర్వినియోగం చేస్తున్నాయని ఈశాన్య రాష్ట్రాల్లో దీనిని తొలగించాలని సుదీర్ఘకాలంగా నిరాహార దీక్ష చేసి జైలు జీవితం కూడా అనుభవించింది.

దీంతో కాలక్రమేనా కేంద్ర ప్రభుత్వాలు ఈ చట్టం యొక్క పరిధిని తగ్గిస్తూ వచ్చాయి. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో, ఈశాన్య రాష్ట్రాల్లోని 31 జిల్లాలు సంపూర్ణంగా, పాక్షికంగా 12 జిల్లాలో అమలు జరుగుతుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా ఈ చట్ట పరిధిని నాగాలాండ్‌లో 15 పోలీస్ స్టేషన్లు (ఏడు జిల్లాలు), మణిపూర్‌‌లో 15 పోలీస్ స్టేషన్లు (ఆరు జిల్లాలు), అస్సాంలో 23 జిల్లాల్లో పూర్తిగా ఎత్తివేసింది.

04 మే 2023 రోజున మణిపూర్ రాష్ట్రంలో రెండు తెగలు (మేయితి ,  కుకీ) మధ్య జరిగిన అల్లర్లలో 142 మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది క్షతగాత్రులు, లక్షల మంది నివాసం కోల్పోయారు.  ప్రాణ, ఆస్తి నష్టంతో పాటు ఆఖరికి మాన నష్టం, ప్రపంచం, సభ్య సమాజం, మహిళా లోకం విస్తుపోయేలా (ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించడం)కూడా జరిగింది.

శాంతి భద్రతల పరిరక్షణలో విఫలం..

ప్రస్తుతం మణిపూర్‌‌లో అధికారంలో బీజేపీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ 144 సెక్షన్, కర్ఫ్యూ లాంటివి విధించినా శాంతి భద్రతల పరిరక్షణలో మాత్రం విఫలమైనట్టు తెలలుస్తోంది.  ఈ ఆర్ముడ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ చట్ట పరిధిని ఎత్తేసిన ప్రదేశంలోనే ఇంత మారణ హోమం జరుగుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించి లేదా మరల ఈ ఆర్ముడ్ ఫోర్స్ స్పెషల్ పవర్ ఆక్ట్ చట్టం యొక్క పరిధిని పునరుద్ధరించి సైన్యానికి పూర్తి హక్కులు ఇస్తే కానీ పరిస్థితులు చక్కబడేలా లేవు. అయితే ప్రజాస్వామ్య భారతదేశంలో దేశ రక్షణ, శాంతి భద్రత విషయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని ఒక పొలిటికల్ మైలేజీగా చూస్తున్నాయే తప్ప సమస్య పరిష్కారం వైపు అడుగులు వేయడం లేదు.

– బందెల సురేందర్ రెడ్డి, మాజీ సైనికుడు

మరిన్ని కథనాల కోసం..

వ్యవసాయమే నా లక్ష్యం..

అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్‌ జర్నలిస్ట్)

పొమ్మనలేక పొగ పెడుతున్నరు..

ఆటోనడిపిన పాలమూరు డెస్క్ జర్నలిస్ట్‌

ఉద్యోగం మానేకే అప్పు ముట్ట జెప్పిన

You may also like...