ప్రజలను మోసగిస్తున్న కాంగ్రెస్
- హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
- డీ హయాంలోనే దేశం అభివృద్ధి
- మూడో సారి కూడా ఆశీర్వదించాలి
- మాజీ మంత్రి ఈటల రాజేందర్
జనగామ, (చౌరాస్తా న్యూస్) : అమలుకు సాధ్యం కానీ హామీలతో గద్దెనెక్కి కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తూ పాలన సాగిస్తోందని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోపించారు. బీజేపీ హైమాండ్ పిలుపుమేరకు చేపట్టిన విజయ సంకల్ప యాత్రలో భాగంగా శుక్రవారం జనగామ చౌరాస్తాలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత రెడ్డి అధ్యక్షత వహించగా ఈటలతో పాటు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఎక్కడ మీటింగ్ పెట్టిన మహిళలు మొదట వస్తున్నారని, కేవలం మీటింగ్ లలో కాకుండా, మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. మహిళలను గుర్తించి నరేంద్ర మోడీ పార్లమెంట్, అసెంబ్లీ లో 33 శాతం రిజర్వేషన్ కల్పించారన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 119 సీట్లలో 40 మందికి అవకాశం వస్తుందని, అదేవిధంగా పార్లమెంట్ 17 సీట్లలో 4, 5 సీట్లు మహిళలవే అన్నారు. కరోన సమయంలో రక్తాన్ని పంచుకొని పుట్టిన వారు పట్టించుకోకుంటే వారికే సేవ చేసిన వారి కాళ్లు కడిగిన, పేద వారిని ఆదుకున్న నాయకులు నరేంద్ర మోడీ అన్నారు. 145 కోట్ల ప్రజలు సేవ చేసే అవకాశం ఇచ్చారని ఆయన మురిసిపోయాడన్నారు. కేసీఆర్ లాగా డబుల్ బెడ్ రూమ్స్, పెన్షన్ నేనే ఇస్తున్న అన్నట్లు మోడీ ఏ రోజు చెప్పలేదన్నారు. కేసీఆర్ కుటుంబంలో వారి అందరికీ ఒక పదవి వుంటుందని, తెలంగాణలో కేవలం కేసీఆర్ కుటుంబం ఒక్కటే బాగుపడిందన్నారు. మోడీకి 140 కోట్ల ప్రజలే తన కుటుంబమని, 4 కోట్ల మంది పేదవారికి ఇల్లులు కట్టించిన ఘనత నరేంద్ర మోడీది అని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పైసలు తీసుకుని కేసీఆర్ ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా కట్టివ్వలేదని ఆరోపించారు. దేశం సుభిక్షంగా ఉండాలంటే మూడోసారి బీజేపీని ఆశీర్వదించాలని కోరారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు కేవీఎల్‌ఎన్ రెడ్డి, ఉడుగుల రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శులు శివారాజ్ యాదవ్, సౌడ రమేష్, జిల్లా ఇంచార్జి కె. పాపారావు, జనగామ అసెంబ్లీ ప్రభరి వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)
ఆటోనడిపిన పాలమూరు డెస్క్ జర్నలిస్ట్
ఉద్యోగం మానేకే అప్పు ముట్ట జెప్పిన